కార్మికుల సంక్షేమంపై దృష్టి సారించాలి | - | Sakshi
Sakshi News home page

కార్మికుల సంక్షేమంపై దృష్టి సారించాలి

May 2 2026 7:38 AM | Updated on May 2 2026 7:38 AM

సూపర్‌బజార్‌(కొత్తగూడెం): మే డే సందర్భంగా జిల్లా న్యాయ సేవా సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం కూలీలైన్‌ రైతుబజార్‌ ఎదురుగా ఉన్న బిల్డింగ్‌ కన్‌స్ట్రక్షన్‌ ఆల్‌వర్కర్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ మీటింగ్‌హాల్‌లో నిర్వహించిన సమావేశంలో జిల్లా న్యా య సేవా సంస్థ కార్యదర్శి ఎం.రాజేందర్‌ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కార్మికుల కృషిదేశ అభివృద్ధికి కీలకమన్నారు. సమాజ నిర్మాణంలో బిల్డింగ్‌, ఇతర కార్మికుల పాత్ర ఎంతో గొప్పదని తెలిపారు. కార్మికులు తమ హక్కులు, సంక్షేమ పథకాలపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని, కార్మికులు ఎదుర్కొనే సమస్యల పరిష్కారానికి న్యాయ సేవా సంస్థ ఎప్పుడూ అందుబాటులో ఉంటుందని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో చీఫ్‌ లీగల్‌ ఎయిడ్‌ డిఫెన్స్‌ కౌన్సిల్‌ వి.పురుషోత్తంరావు, సొసైటీ సభ్యులు, ప్రెసిడెంట్‌ గాజుల రాంచందర్‌, వైస్‌ ప్రెసిడెంట్‌ ఎం.వెంకటేశ్వరరావు, సెక్రటరీ కృష్ణ, ఆర్గనైజింగ్‌ సెక్రటరీ హఫీజ్‌, డి.వెంకటేశ్వరరావు, కార్మికులు పాల్గొన్నారు.

టాటా ఏస్‌ వాహనం బోల్తా

అశ్వాపురం: మండలంలోని సీతరాంపురం గ్రామంలో శుక్రవారం టాటా ఏస్‌ వాహనం బోల్తా పడింది. అశ్వాపురం నుంచి మొండికుంట వైపు కర్రల లోడుతో వెళ్తున్న వాహనం సీతారాంపురం వద్ద మణుగూరు – కొత్తగూడెం ప్రధాన రహదారి వెంబడి అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఎవరికీ ఏమీకాలేదు.

Advertisement
 
Advertisement
Advertisement