సూపర్‌బజార్(కొత్తగూడెం): ప్రజలకు అన్ని వేళల డీజిల్, పెట్రోల్ అందించాలని కలెక్టర్ అంకిత్ సూచించారు. జిల్లాలో పెట్రోల్, డీజిల్ లభ్యతపై గురువారం పెట్రోల్ బంక్ యజమానులు, ఎల్‌పీజీ డిస్ట్రిబ్యూటర్లతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మాట్లాడారు. చమురు కంపెనీల నుంచి సకాలంలో ఇండెంట్‌లు పెట్టి పెట్రోల్, డీజిల్‌ను బంక్‌లలో సమృద్ధిగా ఉంచుకోవాలన్నారు. బ్లాక్ మార్కెట్‌కు తరలించినా, అధిక రేట్లకు విక్రయించినా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. పెట్రోల్ బంక్ నిర్వాహకులు మాట్లాడుతూ తాము ఇండెంట్‌లు పెట్టినా చమురు కంపెనీలు సకాలంలో పెట్రోల్, డీజిల్ పంపిణీ చేయడం లేదని వివరించారు. తమకు తెలియకుండానే ఇండెంట్లను రద్దు చేసి, మళ్లీ కొత్తవి పెట్టమంటున్నారని, దీని కారణంగా బంక్‌లకు సకాలంలో పెట్రోల్ ఉత్పత్తులు రావడం లేదని తెలిపారు. కాగా బీపీసీఎల్, ఐఓసీఎల్ సేల్స్ ఆఫీసర్లు ఈ సమావేశానికి హాజరయ్యారు. హెచ్‌పీసీఎల్ సేల్స్ ఆఫీసర్ సమావేశానికి హాజరుకాలేదు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ డీ వేణుగోపాల్, డీఎస్‌ఓ ప్రేమ్‌కుమార్ పాల్గొన్నారు.
పెట్రోల్ బంక్ యజమానుల
సమావేశంలో కలెక్టర్ అంకిత్


