సూపర్‌బజార్(కొత్తగూడెం): పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని రాష్ట్ర విద్యా శాఖ కార్యదర్శి యోగితా రాణా అన్నారు. గురువారం హైదరాబాద్ నుంచి ఆమె కలెక్టర్లతో 99 రోజుల కార్యక్రమంలో భాగంగా నిర్వహించే విద్య వారోత్సవాలు, పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన, విద్యా కార్యక్రమాల అమలుపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టరేట్ నుంచి కలెక్టర్ అంకిత్ హాజరయ్యారు. వీసీ అనంతరం సంబంధిత అధికారులతో కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి, నాణ్యమైన విద్యను అందించడానికి ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు, తల్లిదండ్రులు సమన్వయంతో కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాఽశాఖాధికారి బి నాగలక్ష్మి, విద్యాశాఖ జిల్లా ప్లానింగ్ కోఆర్డినేటర్ ఎన్ సతీష్ కుమార్, ఏసీజీఈ మాధవరావు, ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు.
అర్హులైన జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డులు..
జిల్లాలో అర్హులైన జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులు జారీ చేయాలని కలెక్టర్ అంకిత్ సూచించారు. గురువారం కలెక్టర్ అధ్యక్షతన మీడియా అక్రిడిటేషన్ కమిటీ సభ్యుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అర్హత కలిగిన జర్నలిస్టులకు, పారదర్శకంగా కార్డులు మంజూరు చేయాలన్నారు. అనంతరం సభ్యులు కలెక్టర్‌ను సన్మానించారు.
రాష్ట్ర విద్యా శాఖ కార్యదర్శి
యోగితా రాణా


