మాస్టారు చెప్పిన పాఠాలు, ప్రభుత్వం ఇచ్చిన సన్నద్ధత పుస్తకాలతో పాటు ‘సాక్షి’ యాజమాన్యం అందించిన గణితం, సైన్స్ మెటీరియల్ ఎంతో ఉపయోగపడింది. ఈ మెటీరియల్ ఆధారంగా పరీక్షలకు సిద్ధమవడం సులువై అత్యధిక మార్కులు సాధించా.
– ఠాకూర్ భావన, సుభాష్‌నగర్ హైస్కూల్
సబ్జెక్టుల వారీగా తరగతి గదిలో విన్న అంశాలను నోట్‌బుక్‌లో రాసుకున్నాం. వీటి సాయంతో ఏడాదంతా చదువుకున్నాం. ఆపై ‘సాక్షి’ యాజమాన్యం అందించిన మెటీరియల్ తక్కువ సమయంలో పూర్తిస్థాయిలో సన్నద్ధమయ్యేందుకు ఎంతో ఉపయోగపడింది.
– బోడ దేవక్, చల్లసముద్రం హైస్కూల్
ఉపాధ్యాయులు మార్గదర్శకంలో జనవరి నుంచి పరీక్షలకు సన్నద్ధమవుతూ వచ్చాం. కానీ గణితం, భౌతికశాస్త్రం రెండింటి విషయంలో కొంత భయపడ్డాం. అదే సమయాన ‘సాక్షి’ యాజమాన్యం ఇచ్చిన మెటీరియల్ చదివాక మాలో భయం పోయింది.
– ప్రియాంక, రొంపేడు
ఆశ్రమ పాఠశాల


