ములకలపల్లి (అన్నపురెడ్డిపల్లి): అన్నదాతలెవరూ అధైర్యపడొద్దని, రైతులు పండించిన ధాన్యం మొత్తం కొనుగోలు చేస్తామని కలెక్టర్ అంకిత్ తెలిపారు. అన్నపురెడ్డిపల్లి, ఊటుపల్లి గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. మాయిశ్చరైజింగ్ యంత్రం పనితీరును పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పీపీసీ సెంటర్లల్లో పక్కాగా రికార్డులు నిర్వహించాలని, తూకం వేసిన ధాన్యాన్ని తక్షణమే మిల్లులకు తరలించాలని ఆదేశించారు. విధి నిర్వహణలో అలసత్వం వహిస్తే కఠినచర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం పెంట్లం గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించారు. త్వరితగతిన నిర్మాణాలు పూర్తి చేయాలని సూచంచారు. తహసీల్దార్ స్వర్ణ, ఎంపీడీఓ మహాలక్ష్మి, ఎంపీఓ షబ్నా, ఎంఏఓ అనూష తదితరులు ఉన్నారు.
కలెక్టర్ అంకిత్


