చుంచుపల్లి: లక్ష్మీదేవిపల్లి మండలంలోని బంగారు చెలకలో అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యాన్ని అధికారులు సీజ్ చేశా రు. సోమవారం తనిఖీలు చేపట్టిన అధికారులు శ్రీనివాస మో డ్రన్ రైస్ మిల్ వద్ద సుమారు 607 ప్లాస్టిక్ బస్తాలలో నిల్వ ఉంచిన 300 క్వింటాళ్ల బియ్యాన్ని పట్టుకున్నారు. సీజ్ చేసి, సంబంధిత వ్యక్తులపై కేసులు నమోదు చేశారు. ఈ తనిఖీల్లో కొత్తగూడెం, భద్రాచలం, ఇల్లెందు డీటీసీఎస్ అధికారులు పాల్గొన్నారు.
బొగ్గు టిప్పర్ దగ్ధం
మణుగూరుటౌన్: ిసంగరేణి మణుగూరు ఏరియాలోని కొండాపురం కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్(కేసీహెచ్‌పీ) వద్ద షార్ట్ సర్క్యూట్‌తో బొగ్గు టిప్పర్ సోమవారం దగ్ధమైంది. పట్టణంలోని శేషగిరినగర్‌కి చెందిన కుమార్ టిప్పర్‌కు డీజిల్ పైప్ లీకేజీ ఉన్నట్లు సమాచారం. కాగా రోజూ మాదిరిగానే బొగ్గు లోడింగ్ కోసం రాగా, మధ్యాహ్నం రెండు గంటల సమయంలో ఓవర్ హీట్ కారణంగా టిప్పర్‌లో మంటలు చెలరేగి ఎగసిపడ్డాయి. దీంతో టిప్పర్ పూర్తిగా దగ్ధమైంది. కాగా, ప్రమాద సమయంలో టిప్పర్‌లో ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది.
మహిళ ఆత్మహత్య
సుజాతనగర్: అప్పు తీసుకుని తిరిగి చెల్లించకపోవడంతో అక్కాచెల్లెళ్ల మధ్య గొడవ జరిగి ఒకరు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన సుజాతనగర్ మండలంలో సోమవారం జరిగింది. ఎస్సై రమాదేవి కథనం ప్రకారం... మండలంలోని లెనిన్‌నగర్‌కు చెందిన తమ్మిశెట్టి నాగమణి (48) తన చెల్లెలుకు ఏడాదిన్నర క్రితం రూ.2 లక్షలు అప్పుగా ఇచ్చింది. తిరిగి ఇవ్వాలని అడుగగా, చెల్లెలు పలుమార్లు వాయిదాలు వేసుకుంటూ వచ్చింది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య గొడవలు జరిగాయి. దీంతో మనస్తాపం చెందిన అక్క నాగమణి ఈ నెల 8న ఎలుకల మందు తాగింది. గమనించిన కుటుంబ సభ్యులు ఖమ్మం ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


