
విద్యా సామర్థ్యాలు పెంపొందించేలా కృషి
భద్రాచలంటౌన్: గిరిజన ఆశ్రమ పాఠశాలల్లోని విద్యార్థుల సామర్థ్యాలు ప్రతీ సబ్జెక్ట్‌లో మెరుగుపడేలా ఉపాధ్యాయులు శ్రద్ధ వహించాలని భద్రాచ లం ఐటీడీఏ పీఓ బి.రాహుల్ సూచించారు. భద్రాచలంలోని బీఈడీ కళాశాలలో ఉమ్మడి జిల్లాలోని పాఠశాలల హెచ్‌ఎంలతో శుక్రవారం ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పీఓ మాట్లాడుతూ.. సబ్జెక్ట్ టీచర్లు ఉద్దీపకం వర్క్‌బుక్‌ల ద్వారా విద్యార్థులకు బోధన సాగించాలని తెలిపారు. పాఠశాలలకు సరఫరా చేసిన నోటుబుక్స్, టెక్ట్‌స్ బుక్స్, యూనిఫామ్‌లు వెంటనే అందించాలని, నూతన మెనూ ప్రకారం భోజనం సమకూర్చాలని సూచించారు. వర్షాకాలం నేపథ్యాన పిల్లల ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తూనే బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. ఆర్‌ఓ ప్లాంట్లు లేనిచోట వేడి చేసిన నీటినే విద్యార్థులకు అందించాలని పీఓ సూచించారు. సమావేశంలో డీడీలు మణెమ్మ, విజయలక్ష్మి, బీఈడీ కళాశాల ప్రిన్సిపాల్ వీరునాయక్, ఏసీఎంఓలు రాములు, రమేశ్, ఏటీడీఓలు అశోక్‌కుమార్, చంద్రమోహన్, రాధమ్మ తదితరులు పాల్గొన్నారు.
ఐటీడీఏ పీఓ రాహుల్