ఇష్టంతో కష్టపడి చదివాం.. | - | Sakshi
Sakshi News home page

ఇష్టంతో కష్టపడి చదివాం..

Jun 12 2025 3:45 AM | Updated on Jun 12 2025 3:45 AM

ఇష్టంతో కష్టపడి చదివాం..

ఇష్టంతో కష్టపడి చదివాం..

బూర్గంపాడు: ప్రస్తుత కరకగూడెం మండలంలోని చిరుమళ్ల నుంచి సుమారు 80 కి.మీ. దూరంలోని బూర్గంపాడుకు వెళ్లి చదువుకున్న రోజులు జీవితంలో ఎన్నో పాఠాలను నేర్పాయి. అక్కడ హాస్టల్‌లోనే ఉన్నా.. సెలవులు వచ్చినప్పుడు, తిరిగి బడికి వెళ్లేటప్పుడు కాలినడకన చెప్పులు లేకుండా అంతదూరం వెళ్లేవాడిని. చదువుపై ఇష్టంతో వాగులు, వంకలు దాటి పుస్తకాలు మోసుకుంటూ తిండీతిప్పలు లేకుండా వెళ్లడంతో మరింత కసిగా చదివా. వేసవి సెలవుల తర్వాత బడికి వెళ్తుంటే స్నేహితులు, ఉపాధ్యాయులను కలుస్తున్నామనే సంతోషం వేసేది. బూర్గంపాడులో 6 – 10వ తరగతి వరకు చదివిన రోజులు ఉన్నత లక్ష్యాలకు బాటలు వేశాయి. అప్పట్లోనే ఓయూలో ఎంఏ, ఎంఫిల్‌ చేశాక డిప్యూటీ కలెక్టర్‌ ఉద్యోగం వచ్చినా కాదనుకుని రాజకీయాల్లోచేరి బూర్గంపాడు ఎమ్మెల్యేగా, ఉమ్మడి ఖమ్మం జెడ్పీ చైర్మన్‌గా ప్రజలకు సేవ చేశా. ఇప్పుడు పాఠశాలల్లో అన్ని వసతులు ఉన్నందున విద్యార్థులు ఉన్నత లక్ష్యాలతో చదువు కొనసాగించి సమాజహితం కోసం పాటుపడాలి.

– చందా లింగయ్య,

జిల్లా పరిషత్‌ మాజీ చైర్మన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement