
వెంకటేశ్వరరావు
హాజరుకానున్న ఇల్లెందు మున్సిపల్‌చైర్మన్
ఇల్లెందు: కేంద్ర ప్రభుత్వం బుధవారం ఢిల్లీలో నిర్వహించ తలపెట్టిన ర్యాలీకి ఇల్లెందు మున్సిపల్ చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వరరావుకు ఆహ్వానం అందింది. కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ‘ఇంటర్నేషనల్ డే ఆఫ్ జీరో వేస్ట్ – ర్యాలీ ఫర్ గార్బేజ్ ఫ్రీ సిటీస్’ అనే అంశంపై ర్యాలీ నిర్వహించనున్నారు. ఇందులో పాల్గొనేందుకు తెలంగాణ నుంచి ఇల్లెందు మున్సిపల్ చైర్మన్‌తోపాటు పీర్జాదిగూడ మేయర్ జక్క వెంకట్‌రెడ్డిలకు ఆహ్వానం అందింది. ర్యాలీ అనంతరం కేంద్ర మంత్రి హరిదీప్ సింగ్ పూరి ఆహ్వానితులతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించనున్నారు. ఇలాంటి బృహత్తర కార్యక్రమానికి ఆహ్వానం అందటం హర్షణీయమని, పట్టణ కీర్తిపై వీడియో క్లిప్ ప్రదర్శిస్తామని వెంకటేశ్వరరావు తెలిపారు.