
సంకల్ప సత్యాగ్రహ దీక్షలో పాల్గొన్న డీసీసీ అధ్యక్షుడు పొదెం వీరయ్య, నాయకులు
బూర్గంపాడు: కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీపై బీజేపీ ప్రభుత్వం కుట్రలు, కుతంత్రాలు చేస్తోందని డీసీసీ అధ్యక్షుడు, భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య విమర్శించారు. సారపాక ప్రధానకూడలిలో మంగళవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన సంకల్ప సత్యాగ్రహ దీక్షను ఆయన ప్రారంభించి మాట్లాడారు. వేల కోట్ల రూపాయల ప్రజల సొమ్మును అదానీ ఖాతాల్లోకి మళ్లించిన విషయాన్ని ప్రశ్నిస్తున్నందునే రాహుల్‌గాంధీపై అనర్హత వేటు వేశారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ కుటుంబం ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని నిలబడ్డ విషయం గుర్తుంచుకోవాలని అన్నారు. రాహుల్ చేపట్టిన భారత్ జోడో యాత్రకు ప్రజల నుంచి విశేష ఆదరణ రావడంతో ప్రధాని మోదీ జీర్ణించుకోలేకపోతున్నారని ఆరోపించారు. ఈ దీక్షల్లో టీపీసీసీ సభ్యుడు తాళ్లూరి చక్రవర్తి, మాజీ జెడ్పీటీసీ సభ్యుడు బట్టా విజయ్‌గాంధీ, మారం వెంకటేశ్వరరెడ్డి, మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు మహ్మద్‌ఖాన్, మండల అధ్యక్షుడు దుగ్గెంపూడి కృష్ణారెడ్డి, బెల్లంకొండ వాసుదేవరావు, పూలపెల్లి సుధాకర్‌రెడ్డి, చల్లా వెంకటనారాయణ, యారం పిచ్చిరెడ్డి, ఎల్లంకి రాము, మందా నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పొదెం వీరయ్య