
మాట్లాడుతున్న కిరణ్ కుమార్
అశ్వారావుపేటరూల్: కొబ్బరి తోటల సాగు ద్వారా రైతులకు అధిక లాభాలు వస్తాయని, ఈ ప్రాంతంలో అధికంగా ఉన్న పామాయిల్ పంటతో సమానంగా ఆదాయాన్ని పొందవచ్చని కొబ్బరి అభివృద్ధి మండలి అధికారి కిరణ్ కుమార్ సూచించారు. మండల పరిధిలోని అచ్యుతాపురం గ్రామంలో ఉన్న ఓ రైతు కొబ్బరితోటలో మంగళవారం నిర్వహించిన కొబ్బరి సాగు క్షేత్ర దినోత్సవంలో ఆయన మాట్లాడారు. పామాయిల్ సాగు అందిస్తున్న రాయితీలు, సబ్సిడీలు కొబ్బరి తోటల సాగుకు అందుతాయని వివరించారు. ఇప్పటికే అశ్వారావుపేట, దమ్మపేట మండలాల్లో కొబ్బరి సాగులో ఉందని, మరింత మంది రైతులు సాగు చేసేందుకు ముందుకు రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉద్యాన శాఖ నియోజకవర్గ అధికారి సందీప్, తెలంగాణ కొబ్బరి రైతుల ఉత్పత్తిదారుల సంఘం బాద్యులు కొక్కరపాటి పుల్లయ్య, నల్లపు శివకుమార్, తాడేపల్లి రవి, సంతపూడి చెన్నారావు, కొనకళ్ల కృష్ణ, పీ ఆదినారాయణ, ఆళ్ల నాగేశ్వరరావు, తుమ్మా రాంబాబు, తలశిల ప్రసాద్ పాల్గొన్నారు.
కొబ్బరి అభివృద్ధి మండలి అధికారి
కిరణ్ కుమార్