కొత్తగూడెంరూరల్: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కానిస్టేబుల్ కుటుంబానికి 6వ బెటాలియన్ కమాండెంట్ డి.శివ ప్రసాద్‌రెడ్డి మంగళవారం రూ.30 లక్షల పరిహారం చెక్కును అందజేశారు. 6వ బెటాలియన్‌కు చెందిన పోలీసుకానిస్టేబుల్ మంచినీళ్ల రమేష్ టేకులపల్లిలో విధులకు వెళ్తూ గతేడాది డిసెంబర్ 18న రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. దీంతో అతని కుటుంబ సభ్యులకు చెక్కు అందించారు. ఎస్‌బీఐ మేనేజర్ మురళీకృష్ణ, అసిస్టెంట్ కమాండెంట్ బి.సీతారాం, టి.కాళీదాస్,ఆర్‌ఐ,ఆర్‌ఎస్‌ఐలతోపాటు బెటాలియన్ సిబ్బంది పాల్గొన్నారు.