పాల్వంచ: పట్టణంలోని నవభారత్ ఎల్‌వీ ప్రసాద్ ఐ ఇనిస్టిట్యూట్‌లో పనిచేసే వైద్య సిబ్బంది 63 మందికి శేఖరం బంజర అర్బన్ హెల్త్ సెంటర్ ఆధ్వర్యంలో మంగళవారం వైద్య పరీక్షలను నిర్వహించారు. ఆస్పత్రిలో పనిచేసే వైద్య సిబ్బంది హెల్త్ ప్రొఫైల్ ఆరోగ్యశాఖకు అందుబాటులో ఉంటుందని ఈ సందర్భంగా యాజమాన్యం తెలిపింది. కార్యక్రమంలో ఎల్‌వీ ప్రసాద్ ఇనిస్టిట్యూట్ మేనేజర్ వి.విజయకుమార్, డిప్యూటీ డెమో ఎండి.ఫయాజ్ మొయినుద్దీన్, హెల్త్ ఎడ్యుకేటర్ విజయ్‌కుమార్, ఎల్‌టీ రాములమ్మ, శృతి తదితరులు పాల్గొన్నారు.