
ప్లాంటేషన్‌ను పరిశీలిస్తున్న జెడ్పీ సీఈఓ విద్యాలత
ఇల్లెందురూరల్: ఎండలు మండుతున్నందున మొక్కలు వడలిపోకుండా సంరక్షణకు అధిక ప్రాధాన్యతనివ్వాలని జెడ్పీ సీఈఓ విద్యాలత పంచాయతీ కార్యదర్శులను ఆదేశించారు. మండలంలోని బొజ్జాయిగూడెం, ఇందిరానగర్ గ్రామపంచాయతీల్లో మంగళవారం అవెన్యూ ప్లాంటేషన్, నర్సరీ, క్రీడా ప్రాంగణాలను తనిఖీ చేసి మాట్లాడారు. రహదారుల వెంట ఉన్న మొక్కలకు విధిగా ట్రీగార్డులు ఏర్పాటు చేయాలని, క్రమం తప్పకుండా నీటిని అందించాలని సూచించారు. ఎండ ప్రభావం పడకుండా నర్సరీలపై షేడ్‌నెట్‌లను విధిగా అమర్చాలని చెప్పారు. ఎంపీడీఓ అప్పారావు, షర్మిల, నాగమణి పాల్గొన్నారు.