
ఆర్థికసాయం అందచేస్తున్న శ్రీనివాసరెడ్డి
చుంచుపల్లి: ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంగళళవారం మండలంలోని పెనగడప, రాంపురం, అంబేద్కర్ నగర్, వనమా నగర్, ములుగు గూడెం, చండ్రుకుంట, గౌతంపూర్, రుద్రంపూర్ ప్రాంతాల్లో పర్యటించారు. ఇటీవల మృతి చెందినవారి కుటుంబాలను పరామర్శించారు. అనారోగ్యంతో బాధపడుతున్న వారిని కలిసి ఆర్థికసాయం అందించారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఊకంటి గోపాలరావు, గోరె బాబు, దుర్గా, నరసింహారావు, సీతయ్య, నాసర్, కృష్ణ, రాజు, హుస్సేన్, విజయ భాస్కర్ రావు, నాగమణి, రాము, ఆదినారాయణ, రాఘు, సతీశ్ తదితరులు పాల్గొన్నారు.