
రేషన్ బియ్యంతో నిందితుడు శ్రీను
అశ్వారావుపేటరూరల్: ఆయిల్‌పాం తోటల్లో పూర్తిగా పక్వానికిరాని గెలలను ఫ్యాక్టరీకి తీసుకురావొద్దని ఆయిల్‌ఫెడ్ డివిజనల్ మేనేజర్ ఆకుల బాలకృష్ణ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం వర్షాలు కురుస్తున్నందున పచ్చి గెలలు కూడా పక్వానికి వచ్చినట్లు కనిపిస్తాయని, రైతులు గమనించాలని సూచించారు. కౌలు రైతులు తమ ఎఫ్ కోడ్ కార్డులను పునరుద్ధరించుకోవాలని, పాత కార్డులను ఏప్రిల్ 1వ తేదీ నుంచి నిలిపివేస్తామని పేర్కొన్నారు. రైతులంతా ఈ నెల చివరి నాటికి కార్డులను పునరుద్ధరించుకోవాలని కోరారు.
రేషన్ బియ్యం పట్టివేత
భద్రాచలంటౌన్: అక్రమంగా తరలిస్తున్న 15 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని సివిల్ సప్లయీస్ అధికారులు మంగళవారం పట్టుకున్నారు. టాటా మ్యాజిక్ వాహనంలో అశ్వాపురం నుంచి ఏపీలోని చట్టికి తరలిస్తుండగా భద్రాచలం బ్రిడ్జి సెంటర్‌లో పట్టుకుని బియ్యంతోపాటు వాహనాన్ని సీజ్ చేశారు. నిందితుడు శ్రీనుపై కేసు నమోదు చేసినట్లు భద్రాచలం సివిల్ సప్లయీస్ డీటీ వెంకటేశ్వర్లు తెలిపారు.