
ఏర్పాట్లపై అధికారులతో చర్చిస్తున్న ఎస్పీ వినీత్
భద్రాచలంటౌన్: ప్రముఖ పుణ్యక్షేత్రమైన భద్రాచలంలో జరిగే గజదభిరాముడి కల్యాణాన్ని ప్రత్యక్షంగా తిలకించేందుకు దేశ నలుమూల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తారు. వారికి ఎలాంటి అసౌకర్యం కలుగకుండా జిల్లా పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. సామాన్య భక్తులతో పాటు వీఐపీలు, వీవీఐపీలు రామయ్య కల్యాణాల్ను తిలకించేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఎస్పీ వినీత్ సోమవారం ఏర్పాట్లను పరిశీలించి, భద్రతకు సంబంధించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ మేరకు ప్రత్యేకంగా అన్‌లైన్ రూట్ మ్యాప్‌ను అవిష్కరించారు. ఇందులో సీతారాముల కల్యాణం జరిగే ప్రదేశంతో పాటు భక్తులకు ప్రభుత్వ, స్వచ్ఛంద సంస్థలు కల్పిస్తున్న సేవలకు సంబంధించిన ప్రదేశాలను వివరంగా తెలియజేశారు. భక్తులకు అందుబాటులో ఉండేలా క్యూఆర్ కోడ్ విడుదల చేశారు.
క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే..
తెలంగాణ పోలీస్ ఆధ్వర్యంలో శ్రీ సీతారాముల కల్యాణానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం క్యూఆర్ కోడ్ ను ఏర్పాటు చేశారు. దీన్ని స్కాన్ చేస్తే కల్యాణ వేడుక నిర్వహించే మిథిలా స్టేడియం, కారు పార్కింగ్, బస్టాండ్‌కు వెళ్లే దారి, భక్తులకు ఏర్పాటు చేసిన విశ్రాంతి ప్రదేశాలు, తలాంబ్రాలు, లడ్లూ కౌంటర్లకు వెళ్లడం ఎలా అనే వివరాలను తెలుసుకోవచ్చు. అలా గే భక్తులతో పాటు వీఐపీలు, వీవీఐపీలకు కేటాయించిన ప్రత్యేక పార్కింగ్ స్థలాలకు వెళ్లే దారులను తెలుసుకోవచ్చు.
మూడు రోజులు పోలీస్ ఆంక్షలు..
శ్రీ సీతారాముల కల్యాణం నేపథ్యంలో భద్రాచలం పట్టణంలో పోలీసులు కఠిన ఆంక్షలు విధించారు. సీఎం కేసీఆర్‌తో పాటు గవర్నర్ తమిళిసై వస్తారనే సమాచారంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా భారీ వాహనాలకు మూ డు రోజుల పాటు పట్టణంలోకి అనుమతి లేదు. ఈ నెల 29 నుంచి 31 వరకు భద్రాచలం పట్టణాన్ని పోలీ సులు తమ ఆధీనంలోకి తీసుకుని నిఘా పటిష్టం చేయనున్నారు. ఇందుకోసం ఎస్పీ డాక్టర్ వినీత్ ప్రతి రోజూ అధికారులతో సమావేశం నిర్వహిస్తున్నారు.
భక్తుల కోసం ఆన్‌లైన్ రూట్ మ్యాప్
నిత్యం పర్యవేక్షిస్తున్న ఎస్పీ వినీత్

క్యూఆర్ కోడ్‌లో పొందుపరిచిన రూట్ మ్యాప్