
చికిత్స అందిస్తున్న వైద్య సిబ్బంది
చర్ల: ఆర్టీసీ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా ఓ వృద్ధురాలికి తీవ్రగాయాలైన సంఘటన సోమవారం చోటుచేసుకుంది. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. చర్లకు చెందిన వృద్ధురాలు కర్రి శారద అనారోగ్యంగా ఉండటంతో చికిత్స కోసం కొయ్యూరు ప్రభుత్వ వైద్యశాలకు ఆర్టీసీ బస్సులో బయల్దేరింది. ఆస్పత్రి ముందు బస్సు నిలపగా, ప్రయాణికులు దిగుతున్నారు. చివరిలో ఉన్న వృద్ధురాలు దిగుతుండగానే బస్సు ముందుకు కదలడంతో ఆమె కింద పడింది. ఆమె కుడికాలుపై నుంచి బస్సు వెనుక చక్రం వెళ్లడంతో కాలు నుజ్జునుజ్జయింది. కొయ్యూరు వైద్యాధికారి శ్రీ ధర్, సిబ్బంది ఆస్పత్రి బయటకు చేరుకుని ప్రథమచికిత్స అందించారు. అనంతరం 108 అంబులెన్సు ద్వారా భద్రాచలం ఆస్పత్రికి తరలించారు. అంబులెన్స్ రావడానికి 40 నిమిషాలు పట్టడంతో అప్పటివరకు వైద్యులు, సిబ్బంది అక్కడే ఉండి ఎండ తగలకుండా క్లాత్ పట్టారు. దీంతో పలువురు వారిని అభినందించారు.
వృద్ధురాలి కాళ్లపై నుంచి
వెళ్లిన బస్సు చక్రాలు