
మాట్లాడుతున్న కళాశాల డీన్ అహ్మద్ హుస్సేన్
అశ్వారావుపేటరూరల్: భూసారం పెంపొందిస్తేనే సమగ్ర వ్యవసాయాభివృద్ధి సాధ్యమవుతుందని అశ్వారావుపేట వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ సయ్యద్ అహ్మద్ హుస్సేన్ పేర్కొన్నారు. సోమవారం ఇఫ్‌కో – తెలంగాణ, వ్యవసాయ కళాశాల ఆధ్వర్యంలో ‘భూసారం పెంపొందించే చర్యలు–భూసార సంరక్షణ’అనే అంశంపై నిర్వహించిన ఒకరోజు శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. భూసారాన్ని పెంచేలా రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. శిక్షణ నిర్వాహకులు టి.దామోదరరెడ్డి, ప్రొఫెసర్లు వెంకన్న, ఐవీఎస్.రెడ్డి, కె.గోపాలకృష్ణ, కాడా సిద్దప్ప, రాంప్రసాద్, రెడ్డి ప్రియ తదితరులు పాల్గొన్నారు.