మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు

- - Sakshi

జూలూరుపాడు: ఇనామ్‌ భూమిని అప్పగించాల ని కోరుతూ జూలూరుపాడు మండలం వెంగన్నపాలెం గ్రామానికి చెందిన దళితులు సోమవా రం తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ ను ఆశ్రయించారు. తమ పూర్వీకులు తంబర్ల ముత్తయ్యకు వెట్టిచాకిరీ కింద అప్పటి ప్రభుత్వం గుండెపుడి రెవెన్యూ పరిధి సర్వే నంబర్‌ 253లోని 1.09 ఎకరాల ఇనామ్‌ భూమి ఇచ్చిందని ముత్తయ్య వారసులు పేర్కొన్నారు. వెంగన్నపాలేనికి చెందిన ఓ వ్యక్తి ఆ భూమిపై అక్రమంగా పట్టా పొందారని, తమ పూర్వీకుల భూ మి తమకు అప్పగించాలని కోరుతూ మానవ హక్కుల కమిషన్‌ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు తంబర్ల నరసింహారావు, తంబర్ల నరేష్‌ వివరాలు వెల్లడించారు.

వేలంపాట ఖరారు

దుమ్ముగూడెం: మండలంలోని పర్ణశాల పంచా యతీలో సర్పంచ్‌ తెల్లం వరలక్ష్మి అధ్యక్షతన సోమవారం బోట్‌ షికారు, వాహన పార్కింగ్‌ వేలం పాట నిర్వహించారు. 2023–24 సంవత్సరానికి వేలం పాట నిర్వహించగా, బోట్‌ షికా రుకు మద్దతు ధర రాకపోవడంతో రద్దు చేశారు. వాహన పార్కింగ్‌ వేలం పాటలో ఐదుగురు వ్యక్తులు పాల్గొన్నారు. వారిలో సోయం రమేష్‌ రూ.26,60,000కు పాటను దక్కించుకున్నాడు. గతేడాది వాహన పార్కింగ్‌కు రూ.14.15 లక్షలు కాగా, ఈ ఏడాది సుమారు రూ.12.45 లక్షల ఆదాయం అదనంగా వచ్చింది. ఈ కార్యక్రమంలో ఎంపీఓ ముత్యాలరావు, పంచాయతీ కార్యదర్శి ప్రసాద్‌రెడ్డి, ఎంపీటీసీ తెల్లం భీమరాజు, ఉప సర్పంచ్‌ వాగే ఖాదర్‌బాబు, వార్డు సభ్యులు గ్రామస్తులు పాల్గొన్నారు.

గంజాయి పట్టివేత

టేకులపల్లి: మండల కేంద్రంలో పెట్రోలింగ్‌ చేస్తున్న క్రమంలో పోలీసులు సోమవారం 900 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. గంజాయి తరలిస్తున్న పాల్వంచ మండలం జగ్గుతండాకు చెందిన యువకుడు గుగులోత్‌ దుర్గా ప్రసాద్‌ను అరెస్ట్‌ చేశారు. సదరు యువకుడు చింతూరు ఏరియాలో గుర్తు తెలియని వ్యక్తుల వద్ద గంజాయి కొనుగోలు చేసి ఖమ్మంలో అధిక ధరకు విక్రయించేందుకు వెళ్తున్నట్లు విచారణలో తేలిందని టేకులపల్లి ఎస్‌ఐ జి.రమణారెడ్డి తెలిపారు. పట్టుబడ్డ గంజాయి విలువ రూ.18 వేలు ఉంటుందని, నిందితుడిని కోర్టులో హాజరుపరుస్తామని పేర్కొన్నారు.

భద్రాచలంలో...

భద్రాచలంటౌన్‌: టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు, ఎకై ్సజ్‌ అధికారులు సోమవారం పట్టణ శివారులోని కూనవరం రోడ్‌లో ఓ యువకుడిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అతని వద్ద గంజాయి లభించగా విచారిస్తున్నట్లు తెలిసింది. కాగా ఈ ఘటనపై సంబంధిత అధికారులెవరూ వివరాలు వెల్లడించలేదు.

గొత్తికోయలకు సామగ్రి వితరణ

దుమ్ముగూడెం: మండలంలోని వలస గొత్తికో య గ్రామం ములకనాపల్లిలో సీఆర్పీఎఫ్‌ 141 బెటాలియన్‌, దుమ్ముగూడెం పోలీసుల ఆధ్వర్యంలో సోమవారం సామగ్రి వితరణ చేశారు. అసిస్టెంట్‌ కమాండెంట్‌ రేవతి, సీఐ దోమల రమేష్‌ ఆధ్వర్యంలో గ్రామంలోని కొత్త గుంపులో 50 కుటుంబాలకు 35 కలాయిలు, 35 స్టీల్‌ కంటైనర్లు, 150 స్టీల్‌ గ్లాసులు, 150 స్టీల్‌ ప్లేట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సీఐ రమేష్‌ మాట్లాడుతూ గ్రామంలో సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని, ఉన్నతాధికారులకు వివరించి పరిష్కరిస్తామని తెలిపారు. సీఆర్పీఎఫ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఆర్‌కె చౌరు స్య, ఎస్‌ఐ కేశవరావు, సిబ్బంది పాల్గొన్నారు.

చోరీ కేసులో నాలుగు నెలల జైలు శిక్ష

అశ్వారావుపేటరూరల్‌: సెల్‌ఫోన్‌ చోరీ కేసులో నిందితుడికి జైలు శిక్ష, జరిమానా విధిస్తూ సోమవారు కొత్తగూడెం జేఎఫ్‌సీఎం మెజిస్ట్రేట్‌ దీప తీర్పు ఇచ్చారు. తీర్పు వివరాలు.. తన సెల్‌ఫోన్‌ చోరీకి గురైందని అశ్వారావుపేటకు చెందిన వంగ చైతన్య 2021లో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. విచారణ చేపట్టిన పోలీసులు ఏపీలోని ఏలూరు జిల్లా కామవరపుకోట మండలం కెండెగూడేనికి చెందిన చీకట్ల సతీష్‌ అలియాస్‌ పాండు చోరీ చేసినట్లు గుర్తించి కేసు నమోదు చేశారు. కోర్టులో విచారణ అనంతరం నిందితుడిపై నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి నాలుగు నెలల జైలు శిక్షతోపాటు, రూ.200 జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చారు. ఈ మేరకు ఎస్‌ఐ బి.రాజేశ్‌కుమార్‌ వివరాలు వెల్లడించారు.

Read latest Bhadradri News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top