ఖమ్మంఅర్బన్: రెండు నెలల క్రితం ఇంటి నుంచి వ చ్చిన మానసిక దివ్యాంగుడిని చేరదీసి ఆరోగ్యం కుదుటపడ్డాక కుటుంబం చెంతకు చేర్చారు. రంగారెడ్డి జిల్లా ఫారూఖ్‌నగర్ మండలం నాగర్లగడ్డ తండాకు చెందిన ఆంగోత్ రవి మద్యానికి బానిసై మానసిక వైకల్యానికి గురికాగా, భార్యాపిల్లలను వదిలేసి బయటకు వచ్చాడు. రెండు నెలల క్రితం ఆయన ఖమ్మం చేరుకుని స్థానికులను ఇబ్బంది పెడుతుండడంతో ఖమ్మం అర్బన్ పోలీసులు గత నెల 27న అన్నం సేవా ఫౌండేషన్‌లో చేర్పించారు. ఆయనకు చికిత్స చేయించడంతో కోలుకోగా తన వివరాలు వెల్లడించారు. దీంతో రంగారెడ్డి జిల్లా పోలీసులు, గ్రామ సర్పంచ్‌కు తెలియజేయగా సోమవారం వచ్చిన రవి తండ్రి చంద్రు, సోదరుడు రతన్‌కు అప్పగించారు.