నిబంధనలు పాటించాల్సిందే
మా పరిధిలో ప్రైవేట్ ట్రావెల్స్ అయినా, ఇతర వాహనాలకు సంబంధించి పక్కాగా నిబంధనలు పాటించాల్సిందే. ప్రైవేట్ ట్రావెల్స్‌కు సంబంధించి చీరాలకు చెందినవి ఏడెనిమిది బస్సులు మాత్రమే ఉన్నాయి. మిగతావి ఇతర ప్రాంతాల నుంచి వచ్చి పోతుంటాయి. బస్సుల నిర్వహకులు ఆల్ ఇండియా పర్మిట్ తీసుకోవటంతో వారు ఎక్కడైనా తిరిగే వెసులు బాటు ఉంది. ఫిట్‌నెస్ విషయంలో రాజీపడటం లేదు. ప్రలోభాలకు తావివ్వటం లేదు. టిక్కెట్ అధిక ధరలకు సంబంధించి కూడా చర్యలు తీసుకుంటున్నాం.
గతంలో చీరాలకు చెందిన డ్రైవర్, మరో ఐదుగురు మృతి
సుమారు రెండేళ్ల క్రితం ప్రైవేటు ట్రావెల్స్ బస్సు, టిప్పర్ ఢీకొన్న ఘటనలో చీరాలకు చెందిన డ్రైవర్‌తో పాటు చినగంజాం మండలంకు చెందిన ఆరుగురు మృతి చెందారు. గత అసెంబ్లీ ఎన్నికలకు తమ ఓటు హక్కు వినియోగించేకునేందుకు ఇతర ప్రాంతాల నుంచి కొన్ని వేల మంది తమ స్వస్థలాలకు వచ్చారు. పోలింగ్ మరుసటి రోజు సింహభాగం తిరుగు ప్రయాణం కట్టారు. అందులో భాగంగా చినగంజాం నుంచి హైదరాబాద్‌కు బయలుదేరిన ట్రావెల్ బస్సు ఒకటి. ఆ క్రమంలో చిలకలూరిపేట సమీపంలో ఆ ప్రైవేటు బస్సు, టిప్పర్ ఢీ కొనడంతో అగ్నికీలలు ఎగశాయి. మంటల్లో చిక్కుకుని ఆరుగురు మృతి చెందారు.
రాయవరం బస్సు ప్రమాదంపై సర్వత్రా దిగ్భ్రాంతి
చీరాల అర్బన్: నిర్లక్ష్యం ఖరీదు, నిండు ప్రాణాలవుతున్నాయి. వాహనాల రూపంలో చావు డప్పు మోగుతోంది. తలా పాపం తిలా పిడికెడులా ట్రావెల్స్ బస్సులు అత్యంత భారీ ప్రాణ నష్టాన్ని తెస్తున్నాయి. చీరాల నుంచి రోజుకు 35 నుంచి 40 ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తుంటాయి. వాటిపై స్థానిక రవాణాశాఖ అధికారులు ఎప్పటికప్పుడు ప్రత్యేక దృష్టి సారించాల్సిన ఆవశ్యకతను ప్రజలు సూచిస్తున్నారు.
పండగలు ఇతరత్రా రద్దీ ప్రయాణాలు ఉండే సమయంలో టిక్కెట్ ధరలను అమాంతం పెంచేయటం పరిపాటిగా మారింది. వీటన్నింటికీ చేతులు మారుతున్న మమూళ్లే కారణమని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఏదైనా ఘటన జరిగినప్పుడు అధికారులు ఒకటి, రెండు రోజులు హడావుడి చేయటం, తరువాత యథావిధిగా తమ పంథాలో అడుగులు వేయటంతో ప్రమాదాలకు అడ్డుకట్ట పడటం లేదనే వాదనలు సర్వత్రా వినిపిస్తున్నాయి.
తాజాగా మార్కాపురం జిల్లా రాయవరం సమీపంలో గురువారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 14 మంది చనిపోవడం, 28 మంది గాయాలు పాలవ్వటంతో అంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.
కనీసం ఇప్పటికై నా రవాణాశాఖ అధికారులు ప్రలోభాలకు లోనుకాకుండా, ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల విషయంలో పూర్తి స్థాయి నిబంధనలు అమలయ్యే విధంగా తగిన చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.
ప్రైవేటు ట్రావెల్స్ బస్సులు సంబంధిత రిజిస్ట్రేషన్ నెంబరుతో ఏ రూట్ పర్మిట్ ఉంటుందో, ఆ రూట్‌లో మాత్రమే తిరగాలి. అయితే కొన్ని సందర్భాల్లో ట్రావెల్స్ నిర్వహకులు బేఖాతరు చేస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. వీటిపై సంబంధిత రవాణాశాఖ అధికారులు చూసీచూడనట్లు ఉంటున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
కొన్ని ప్రైవేటు ట్రావెల్స్ బస్సుల్లో కొన్ని పైకి అందంగా కనిపిస్తూ, బాడీ, ఇంజన్ కండిషన్ సక్రమంగా ఉంటం లేదు. కొందరు ఇతర ప్రాంతాల్లో వాడిన బస్సులను తక్కువ ధరకు కొనుగోలు చేసి వాటికి ౖపైపె మెరుగులు దిద్ది, అధికారులను ప్రసన్నం చేసుకుని తిప్పుతున్నారనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి.
ప్రైవేటు ట్రావెల్స్ బస్సుల్లో టిక్కెట్లు ధరలపై కూడా అధికారుల నియంత్రణ ఉండటం లేదనే విమర్శలు ఉన్నాయి. ప్రధానంగా పండగలు, ప్రత్యేక వరుస సెలవు దినాల్లో ట్రావెల్స్ ఏజెన్సీలు వారు చెప్పిందే ధరగా ఉంటుంది. వీటన్నింటికీ బాధ్యులు ఎవరనేది సంబంధిత అధికారులే చెప్పాలి.
ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల
ఫిట్‌నెస్‌పై సర్వత్రా సందేహాలు
పండగ వేళ,
ఇతర సమయాల్లో ఇష్టారీతిన
టిక్కెట్ ధరలు
ప్రయాణికుల భద్రత
గాలిలో
దీపమేనా!
నిబంధనలకు విరుద్ధంగా
రూట్
మ్యాప్‌లు !
నిమ్మకాయల ధరలు
పీఆర్కేను కలిసిన శ్యామల
సాగర్ నీటిమట్టం వివరాలు
బాపట్ల
రవాణాశాఖ అధికారులు పట్టించుకోవటం లేదనే విమర్శలు
● వ్యక్తి మృతి
రేపల్లె: అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి చెందిన సంఘటన పట్టణంలో చోటు చేసుకుంది. సీఐ మల్లికార్జునరావు వివరాల మేరకు బస్టాండ్ సమీపంలో మురుగు కాల్వలో అనుమాస్పద స్థితిలో మృతదేహం పడి ఉండటాన్ని శనివారం గమనించిన స్థానికులు సమాచారం అందించారన్నారు. మృతదేహాన్ని పరిశీలించగా మృతుడి ముఖంపై గాయాలు ఉన్నట్లు పేర్కొన్నారు. మృతుడు నిజాంపట్నం మండలం ఎడ్లంకకు చెందిన మాతంగి సురేష్ (40)గా గుర్తించటం జరిగిందని, ప్రస్తుతం రేపల్లెలోనే నివసిస్తున్నట్లు తెలిపారు.
I
– రామకృష్ణారెడ్డి,
ఎంవీఐ, చీరాల
రాయవరం ఘటనతో ఉలిక్కిపడ్డ రాష్ట్రం
నిబంధనలకు విరుద్ధంగా రూట్ మ్యాప్‌లు
ౖపైపె సొబగులు
టిక్కెట్ ధరలపై నియంత్రణ లేదా?
తెనాలి: తెనాలి మార్కెట్ యార్డులో శనివారం క్వింటా నిమ్మకాయలు కనిష్ట ధర రూ.5,000, గరిష్ట ధర రూ.9,000, మోడల్ ధర రూ.7,500 వరకు పలికింది.
మాచర్ల:వైఎస్సార్ సీపీ పల్నాడు జిల్లా అధ్యక్షుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్యామల హైదరాబాద్‌లో మర్యాదపూర్వకంగా శనివారం కలిశారు.
విజయపురిసౌత్: నాగార్జునసాగర్ జలాశయ నీటిమట్టం శనివారం 535.80 అడుగులకు చేరింది. శ్రీశైలం నుంచి సాగర్ జలాశయానికి వచ్చే నీటిచేరిక పూర్తిగా నిలిచిపోయింది.
చిలకలూరిపేట: గత సార్వత్రిక ఎన్నికల సమయంలో ఓట్లు వేసి తిరిగి హైదరాబాద్ వెళ్తున్న క్రమంలో ఏపీ 27 టీటీ 6577 ట్రావెల్స్ బస్సు చిలకలూరిపేట మండలం పసుమర్రు గ్రామ శివారు ఈవూరివారిపాలెం డొంక వద్ద ఎదురుగా వస్తున్న కంకర టిప్పర్‌ను ఢీకొట్టింది. ఈ సంఘటనలో బస్సు, టిప్పర్ డ్రైవర్, ఎనిమిదేళ్ల చిన్నారి సహా ఆరుగురు సజీవ దహనమయ్యారు. సంఘటన 14 మే, 2024 అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో జరిగింది.


