పర్చూరు వరకు గుంటూరు చానల్‌ పొడిగించాలి | - | Sakshi
Sakshi News home page

పర్చూరు వరకు గుంటూరు చానల్‌ పొడిగించాలి

Mar 29 2026 7:03 AM | Updated on Mar 29 2026 7:03 AM

భక్త ప్రహ్లాద సన్నివేశంలో ఉగ్రరూపంలో నృసింహుడు శ్రీనివాస కల్యాణ నృత్య ప్రదర్శనలో చిన్నారులు

పర్చూరు(చినగంజాం): పర్చూరు ప్రాంత రైతులు సుదీర్ఘ కాలంగా పోరాడుతున్న గుంటూరు చానల్‌ పొడిగింపు పనులు సత్వరం ప్రారంభించి స్థానిక రైతుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని నల్లమడ రైతు సంఘం నాయకులు డిమాండ్‌ చేశారు. పర్చూరులోని బొమ్మల సెంటర్‌ వద్ద శనివారం నల్లమడ ప్రాంత రైతులు, నాయకులు తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ధర్నా నిర్వహించారు. వారు మాట్లాడుతూ పర్చూరు ప్రాంత రైతులు సుదీర్ఘ ఆందోళనలు, పోరాటం అనంతరం ప్రభుత్వం గుంటూరు చానల్‌ను పొడిగించే పనులు చేపట్టి భూసేకరణకు అవసరమైన రూ.113 కోట్లలో రూ.11 కోట్లు మాత్రమే ఇచ్చారన్నారు. ప్రభుత్వం సత్వరం పెదనందిపాడు మండలంలోని గ్రామాలకు, పర్చూరు మండలంలోని గ్రామాలకు గెజిట్‌ నోటిఫికేషన్‌ ఇచ్చి భూ సేకరణ పనులు పూర్తిచేసి చానల్‌ పొడిగింపు పనులు ప్రారంభించాలన్నారు. చానల్‌ను పొడిగించడం ద్వారా ప్రజల తాగు, సాగునీరు అందుతుందని త్వరగా పనులు పూర్తి చేయాలన్నారు. విదేశీ దిగుమతులను వెంటనే ఆపివేసి స్వామినాథన్‌ కమిషన్‌ సిఫార్సుకు అనుగుణంగా మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని డిమాండ్‌ చేశారు.

కనీస మద్దతు ధర అందించాలి..

మొక్కజొన్నకు ప్రభుత్వ కనీస మద్దతు ధర రూ.2400 కాకుండా రూ.2928కు కొనుగోలు చేయాలని, శనగ కొనుగోళ్లకు సంబంధించి ప్రభుత్వం ఫ్రకటించిన కనీస రూ.5875 కాకుండా రూ.7500 మద్దతు ధర కల్పించాలని కోరారు. శనగకు డిస్టోన్‌ మిషన్‌లను కొనుగోలు కేంద్రాల వద్ద ఏర్పాటు చేయాలని కోరారు. అనంతరం రైతులు తమ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని తహసీల్దార్‌ పీ బ్రహ్మయ్యకు అందజేశారు. కార్యక్రమంలో నల్లమడ రైతు సంఘం నాయకులు డాక్టర్‌ కొల్లా రాజమోహనరావు, కోటా హరిబాబు, ఒగ్గిశెట్టి నరసింహులు, వైఏ చౌదరి, లావు అంకమ్మచౌదరి, అడుసుమల్లి జగన్నాధం, నాయుడు సుబ్బారావు, అడ్డగడ వెంకటేశ్వర్లు, నందిపాడు పున్నయ్య, కొల్లా నిర్మల, మంజూష, రత్నకుమారి, గోరంట్ల బుచ్చయ్య, భాస్కరరావు, లంకశివ, నల్లమండ ప్రాంత రైతులు పాల్గొన్నారు.

పర్చూరులో నల్లమడ రైతు సంఘం

నాయకుల ధర్నా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement