భట్టిప్రోలు: భట్టిప్రోలులోని విఠలేశ్వరనగర్‌లో శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవాల్లో వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా చిన్నారులు ప్రదర్శించిన నృత్యాలు ఆద్యంతం ఆహుతులను అలరించాయి. శ్రీలక్ష్మీ కూచిపూడి నృత్య కళాక్షేత్రం ఎ.వెంకటలక్ష్మి(తెనాలి) ఆధ్వర్యంలో 13 ఏళ్ల చిన్నారి బిట్రా సహిత, నృత్య కళాక్షేత్రం బృందం చిన్నారులు ప్రవస్తి, హేమ, ఆస్త్రిత, నిష, లహరిలు నృత్య ప్రదర్శనలను కనులపండువగా ప్రదర్శించారు. రాధాకృష్ణుల కథ, శ్రీనివాస కల్యాణం, భక్త ప్రహ్లాద చరిత్ర, కూచిపూడి నృత్యాలు, కోలాటం వంటి కార్యక్రమాలు వైభవోపేతంగా సాగాయి. తొలుత టీటీడీ బాల గోపాల భజన మండలి స్థానిక మాతా కాన్వెంట్ బాలికలతో కోలాట ప్రదర్శన నిర్వహించింది. అధ్యక్షులు బూర్లె అరుణకుమారి, కొత్త నాగవెంకట రవితేజ కార్యక్రమాలను పర్యవేక్షించారు. స్థానికులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి కార్యక్రమాలను వీక్షించారు.


