ఇంటర్నేషనల్‌ బ్యాడ్మింటన్‌ పోటీల్లో న్యుమేర్‌ సత్తా | - | Sakshi
Sakshi News home page

ఇంటర్నేషనల్‌ బ్యాడ్మింటన్‌ పోటీల్లో న్యుమేర్‌ సత్తా

Dec 21 2025 9:21 AM | Updated on Dec 21 2025 9:21 AM

ఇంటర్

ఇంటర్నేషనల్‌ బ్యాడ్మింటన్‌ పోటీల్లో న్యుమేర్‌ సత్తా

ఇంటర్నేషనల్‌ బ్యాడ్మింటన్‌ పోటీల్లో న్యుమేర్‌ సత్తా బీఎస్‌ఎన్‌ఎల్‌ డైరెక్టర్‌గా హనుమంతరావు పాలిటెక్నిక్‌ క్రీడల్లో ఓవరాల్‌ చాంపియన్‌షిప్‌ కై వసం చివరి విడత స్పాట్‌ కౌన్సెలింగ్‌ పట్టణ పోలీసుల అదుపులో ముగ్గురు యువకులు?

850 డాలర్లు ప్రైజ్‌మనీ అందజేసిన నిర్వాహకులు

చీరాల రూరల్‌: బంగ్లాదేశ్‌లో జరిగిన ఓపెన్‌ ఇంటర్నేషనల్‌ షటిల్‌ బ్యాడ్మింటన్‌ పోటీల్లో చీరాలకు చెందిన బ్యాడ్మింటన్‌ క్రీడాకారుడు షేక్‌ న్యుమేర్‌ అత్యుత్తమ ప్రదర్శనతో ద్వితీయ స్థానం సాఽధించాడు. పోటీల నిర్వాహకులు చేతులు మీదుగా 850 డాలర్లు ప్రైజ్‌మనీ అందుకున్నాడు. ఈనెల 16వ తేదీ నుంచి 20 వరకు బంగ్లాదేశ్‌ రాజధాని ఢాకాలో ఓపెన్‌ ఇంటర్నేషనల్‌ షటిల్‌ బ్యాడ్మింటన్‌ పోటీలు నిర్వహించారు. వైఎస్సార్‌ సీపీ మైనార్టీ సెల్‌ రాష్ట్ర నాయకుడు, మాజీ మున్సిపల్‌ కోఆప్షన్‌ సభ్యుడు షేక్‌ హుమాయూన్‌ కబీర్‌ కుమారుడు షేక్‌ న్యుమేర్‌ మెన్స్‌ సింగిల్స్‌ విభాగంలో పాల్గొని, కెరీర్‌లోనే అత్యుత్తమ ప్రదర్శన కనబరిచాడు. ప్రత్యర్థులను పదునైన రాకెట్లతో చిత్తు చేసి ద్వితీయ స్థానం సాధించాడు. నిర్వాహకుల చేతులు మీదుగా ప్రైజ్‌మనీతో పాటు మెడల్‌, సర్టిఫికెట్‌ అందుకున్నాడు. న్యుమేర్‌ను పలువురు సీనియర్‌ క్రీడాకారులు, క్రీడాభిమానులు అభినందనలు తెలియజేశారు. న్యుమేర్‌ గతంలో కూడా అనేక రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని పతకాలు సాధించాడు.

జె.పంగులూరు: ఉమ్మడి ప్రకాశం జిల్లా బీఎస్‌ఎన్‌ఎల్‌ డైరెక్టర్‌గా వైఎస్సార్‌ సీపీ నాయకులు స్వయంపు హనుమంతురావు నియమితులయ్యారు. ఈ మేరకు శనివారం ఆయనకు ఒంగోలు కార్యాలయంలో నియామక పత్రాన్ని అందజేశారు. స్వయంపు హనుమంతురావు వైఎస్సార్‌ సీపీ నాయకులుగా ఈ ప్రాంతంలో ప్రజలందరికీ సుపరిచితులే. కొంతకాలం పంగులూరు ఇన్‌చార్జ్‌గా ప నిచేశారు. ఆయన చేసిన సేవలను గుర్తించి ఆధిష్టానం బీఎస్‌ఎన్‌ఎల్‌ అధికారులకు పేరును సిఫార్సు చేసింది. కార్యక్రమంలో గుంటూరు పీజీ ఎంటీడీ సప్పరపు శ్రీధర్‌, గుంటూరు డీజీఎం సీవీ గిరిబాబు, ఒంగోలు డీఈ చంద్రశేఖర్‌, ఒంగోలు ఎస్‌డీ మురళీ కృష్ణ పాల్గొన్నారు.

గుంటూరు ఎడ్యుకేషన్‌: గుజ్జనగుండ్లలోని ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్‌లో సాంకేతిక విద్యాశాఖ ఆధ్వర్యంలో రెండు రోజులపాటు జరిగిన 28వ ప్రాంతీయస్థాయి ఇంటర్‌ పాలిటెక్నిక్‌ స్పోర్ట్స్‌ అండ్‌ గేమ్స్‌ మీట్‌ శనివారం ముగిసింది. ఈ సందర్భంగా రెండు రోజులపాటు నిర్వహించిన క్రీడలు, ఆటల పోటీల్లో ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్‌ ఓవరాల్‌ చాంపియన్‌షిప్‌ కై వసం చేసుకుంది. ఈ సందర్భంగా కళాశాలలో జరిగిన కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ జాస్తి ఉషారాణి, అధ్యాపకులు కలసి విద్యార్థినులను అభినందించారు.

గుంటూరు రూరల్‌: ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఏపీ ఎంసెట్‌ 2025 ర్యాంకుల ద్వారా బీఎస్సీ అగ్రికల్చర్‌, బీటెక్‌ ఫుడ్‌ టెక్నాలజీ కోర్సుల్లో ప్రవేశాలకు ఆన్‌లైన్‌లో రిజిస్టర్‌ చేసుకున్న, చేసుకోని విద్యార్థులకు చివరి విడత స్పాట్‌ కౌన్సెలింగ్‌ను నిర్వహిస్తున్నట్లు విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్‌ డాక్టర్‌ ఎంవీ రమణ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. విశ్వవిద్యాలయం పరిధిలోని కళాశాలల్లో 2025–26 విద్యాసంవత్సరానికి ఆన్‌లైన్‌లో రిజిస్టర్‌ చేసుకున్న విద్యార్థులకు ఈనెల 22వ తేదీ, 24వ తేదీలలో స్పాట్‌ కౌన్సెలింగ్‌ జరుగుతుందన్నారు. పూర్తి వివరాలకు విశ్వవిద్యాలయం వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించారు.

సత్తెనపల్లి: పట్టణ పోలీసుల అదుపులో ముగ్గురు యువకులు ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. వివరాలు ఇలా ఉన్నాయి. విజయవాడకు చెందిన మైనర్‌ విద్యార్థిని గుంటూరుకు చెందిన ఓ యువకుడు ట్విట్టర్‌ ద్వారా పరిచయమయ్యాడు. ఆ యువకుడికి గుంటూరుకు చెందిన మరో యువకుడు ట్విట్టర్‌లో పరిచయం కావడంతో ఇరువురు కలిసి విజయవాడకు చెందిన మైనర్‌ విద్యార్థిని కారులో సత్తెనపల్లికి తీసుకువచ్చారు. గుంటూరుకు చెందిన ఇద్దరు యువకులకు సత్తెనపల్లికి చెందిన ఓ యువకుడు సహకరించడంతో ముగ్గురు కలిసి ఆమెను ఆర్టీసీ బస్టాండ్‌ సమీపంలోని ఓ హోటల్‌ గదిలో ఉంచారు. విద్యార్థిని తండ్రి కుమార్తె అదృశ్యమైందని విజయవాడ పోలీసులను ఆశ్రయించాడు. విజయవాడ పోలీసులు మైనర్‌ విద్యార్థిని సెల్‌ఫోన్‌ సంకేతాల ఆధారంగా సత్తెనపల్లిలో ఉన్నట్లు లోకేషన్‌ చూపించడంతో వారు ఇక్కడి పోలీసులను సంప్రదించినట్లు సమాచారం.

ఇంటర్నేషనల్‌ బ్యాడ్మింటన్‌ పోటీల్లో న్యుమేర్‌ సత్తా  1
1/2

ఇంటర్నేషనల్‌ బ్యాడ్మింటన్‌ పోటీల్లో న్యుమేర్‌ సత్తా

ఇంటర్నేషనల్‌ బ్యాడ్మింటన్‌ పోటీల్లో న్యుమేర్‌ సత్తా  2
2/2

ఇంటర్నేషనల్‌ బ్యాడ్మింటన్‌ పోటీల్లో న్యుమేర్‌ సత్తా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement