ఉత్కంఠభరితంగా ఖోఖో పోటీలు
జె.పంగులూరు: స్థానిక మాంగుట సుబ్బరామిరెడ్డి, బాచిన నారాయణమ్మ జూనియర్ కళాశాల క్రీడా ప్రాగణంలో, ఎస్‌ఆర్‌ఆర్ ఖోఖో అకాడమీ ఆధ్వర్యంలో రెండు రోజుల నుంచి రాష్ట్ర స్థాయి ఖోఖో పోటీలు జరుగుతున్నాయి. శనివారం మెదటి పూల్‌లో బాలురకు 12, బాలికలకు 12 మ్యాచ్ జరిగాయి. మొత్తం 48 టీంలు పాల్గొన్నాయి. బాలుర టీంలో క్వార్టర్ ఫైనల్‌కు ప్రకాశం, కర్నూలు, గుంటూరు, విశాఖ, విజయనగరం, చిత్తూరు, ఈస్టు గోదావరి, కృష్ణ జిల్లా జట్లు చేరాయి. బాలికల విభాగంలో క్వార్టర్ ఫైనల్‌కు అనంతపురం, విజయనగరం, కర్నూలు, చిత్తురు, ప్రకాశం, తూర్పు గోదావరి, విశాఖ, శ్రీకాకుళం జట్లు చేరాయి. చివరి రోజు ఆదివారం క్వార్టర్ ఫైనల్, సెమీ ఫైనల్, ఫైనల్ మ్యచ్‌లు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
ఉత్కంఠభరితంగా ఖోఖో పోటీలు


