ఇద్దరు డాక్టర్లు, పదిమంది సిబ్బంది సస్పెన్షన్‌ | - | Sakshi
Sakshi News home page

ఇద్దరు డాక్టర్లు, పదిమంది సిబ్బంది సస్పెన్షన్‌

Dec 6 2025 7:48 AM | Updated on Dec 6 2025 7:48 AM

ఇద్దర

ఇద్దరు డాక్టర్లు, పదిమంది సిబ్బంది సస్పెన్షన్‌

నాదెండ్ల: విధుల్లో అలసత్వం వహించిన వైద్యు లు, సిబ్బందిపై సస్పెన్షన్‌ వేటు పడింది. పల్నాడు జిల్లా గణపవరం పీహెచ్‌సీని బుధవారం రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్‌ వీరపాండ్యన్‌ సందర్శించిన విషయం విదితమే. ఆ సమయంలో ఆసుపత్రికి తాళాలు వేసి ఉండటం గమనించి విషయాన్ని వైద్య ఆరోగ్యశాఖ డైరెక్టర్‌ డాక్టర్‌ కె పద్మావతి,డీఎంహెచ్‌వో రవికి సమాచారమిచ్చారు.గురువారం డాక్టర్లు కవితా అనసూయ, ప్రసాద్‌నాయక్‌, ఎంపీహెచ్‌ఈవో శ్రీనివాసరెడ్డి, హెచ్‌ఈ అంజమ్మ, ఎస్‌ఎ హనుమంత్‌నాయక్‌, స్టాఫ్‌నర్సులు అరుణ, విజయ, మస్తాన్‌బి, ఎల్‌టీ అరుణకుమారి, సూపర్‌ వైజర్లు రహిమాన్‌బాషా, జానకీదేవి, ఎఫ్‌ఎన్‌వో పుట్లమ్మలను సస్పెండ్‌ చేశారు. వీరి స్థానంలో చిలకలూరిపేట ఏరి యా ఆసుపత్రిలో డాక్టర్లుగా పనిచేస్తున్న షేక్‌ సుమయా, హరిహరన్‌తోపాటూ ఎనిమిది మంది సిబ్బందిని నియమించారు. శుక్రవారం వీరు పీహెచ్‌సీలో వైద్య సేవలందించారు.

ఎన్జీ రంగా వ ర్సిటీలో

ప్రపంచ మృత్తికా దినోత్సవం

గుంటూరురూరల్‌: ఆచార్య ఎన్జీరంగా వ్యవసా య విశ్వవిద్యాలయంలో ప్రపంచ మృత్తికా ది నోత్సవాన్ని శుక్రవారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న విశ్వవిద్యాలయం వీసీ డాక్టర్‌ ఆర్‌. శారదజయలక్ష్మిదేవి మాట్లాడుతూ ప్రతి ఏటా డిసెంబర్‌ 5న నేల ప్రాముఖ్యతను గుర్తుంచుకోవటానికి ప్రపంచ మృత్తికా దినోత్సవాన్ని జరుపుకుంటామన్నారు. విస్తరణ సంచాలకుడు డాక్టర్‌ జి.శివన్నారాయణ మృత్తికా దినోత్సవ ప్రాముఖ్యతను వివరించారు. మృత్తికాశాస్త్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్‌ వి.శైలజ ఈ ఏడాది ఆరోగ్య పట్టణాల కోసం ఆరోగ్యమైన నేలలు అనే అంశంపై అవగాహన కల్పించారు. పీజీ స్టడీస్‌ డీన్‌ డాక్టర్‌ ఏవీ రమణ మాట్లాడు తూ నేల లోపల కోటాను కోట్ల మేలు చేసే సూక్ష్మజీవులు ఉంటాయని తెలిపారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్‌ డాక్టర్‌ ఎంవీ రమణ, డాక్టర్‌ బీవీఎస్‌ ప్రసాద్‌, డాక్టర్‌ డి.సంతప్‌కుమార్‌, డీన్‌ డాక్టర్‌ పి.సాంబశివరావు పాల్గొన్నారు.

నిత్యాన్నదానానికి రూ. లక్ష విరాళం

ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న నిత్యాన్నదానానికి గుంటూరు కృష్ణ నగర్‌కు చెందిన మట్ట శ్రీనివాస్‌, జయలక్ష్మి, పద్మావతి ఆలయ ఈవో శీనానాయక్‌ను కలిసి నిత్యాన్నదానానికి రూ.1,01,116 విరాళాన్ని అందజేశారు. దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం ఆలయ అధికారులు అమ్మ వారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను బహూకరించారు. ఆలయ అభివృద్ధికి దాతలు సహకరించాలని ఈఓ శీనునాయక్‌ తెలిపారు.

జనసేన కార్పొరేటర్‌కు పరాభవం

పీటీఎం వేదికపైకి ఆహ్వానించకుండా

సమావేశాన్ని నిర్వహించిన టీడీపీ నాయకులు

గుంటూరు ఎడ్యుకేషన్‌: మెగా పేరెంట్స్‌, టీచర్స్‌ మీటింగ్‌ సందర్భంగా జనసేన కార్పొరేటర్‌కు పరాభవం ఎదురైంది. తూర్పు నియోజకవర్గ పరిధిలోని 56వ డివిజన్‌లో నెహ్రూనగర్‌ 7వ లైనులో నగరపాలకసంస్థ ప్రాధమిక పాఠశాలలో నిర్వహించిన పీటీఎంకు స్థానిక జనసేన కార్పొరేటర్‌ అయిశెట్టి కనకదుర్గను వేదికపైకి ఆహ్వానించలేదు. 55, 56 డివిజన్లకు చెందిన టీడీపీ, జనసేన నాయకులు అతిధులుగా పాల్గొని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో సమావేశాన్ని నిర్వహించారు. సమావేశంలో పాల్గొనేందుకు వచ్చిన కార్పొరేటర్‌ కనకదుర్గను పాఠశాల హెచ్‌ఎం తన వంతు బాధ్యతగా వేదికపైకి పిలిచేందుకు ప్రయత్నించినప్పటికీ, టీడీపీ, జనసేన నాయకులు పట్టించుకోకుండా హేళనగా చూశారు. దీంతో ఆమె తీవ్ర మనస్తాపం చెందారు. సమావేశాన్ని టీడీపీ మహిళా నాయకురాలు గుడిపల్లి వాణీ నిర్వహించారు. ఈ సంఘటనతో టీడీపీ, జనసేనల మధ్య విభేదాలు బయటపడ్డాయి.

ఇద్దరు డాక్టర్లు, పదిమంది సిబ్బంది సస్పెన్షన్‌ 1
1/3

ఇద్దరు డాక్టర్లు, పదిమంది సిబ్బంది సస్పెన్షన్‌

ఇద్దరు డాక్టర్లు, పదిమంది సిబ్బంది సస్పెన్షన్‌ 2
2/3

ఇద్దరు డాక్టర్లు, పదిమంది సిబ్బంది సస్పెన్షన్‌

ఇద్దరు డాక్టర్లు, పదిమంది సిబ్బంది సస్పెన్షన్‌ 3
3/3

ఇద్దరు డాక్టర్లు, పదిమంది సిబ్బంది సస్పెన్షన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement