ప్రభుత్వ పథకాలను అందిపుచ్చుకోవాలి
ప్రభుత్వ పథకాలను అందిపుచ్చుకోవాలి బాపట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందిపుచ్చుకొని లబ్ధిదారులు అభివృద్ధి చెందాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్‌కుమార్ అన్నారు. స్థానిక కలెక్టరేట్ ఆవరణలో ప్రధానమంత్రి ఎంప్లాయిమెంట్ గ్యారెంటీ ప్రోగ్రాం (పీఎంఈజీపీ) పథకం కింద చెరుకుపల్లి మండలం గూడవల్లి గ్రామ సంఘం, ఆదర్శ మహిళ స్వయం సహాయక సంఘ గ్రూప్ సభ్యురాలు తురిమెళ్ల కరుణకుమారికి కియా కారును జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్‌కుమార్ శుక్రవారం అందజేశారు. పీఎంఈజీపీ కింద లబ్ధిదారులు కోరిన విధంగా వారి జీవనోపాధి కోసం కియా కారును అందజేయమైనదని, యూనిట్ విలువ రూ.13 లక్షల 93 వేలు కాగా అందులో బ్యాంకు లోను రూ.13 లక్షల 11 వేలు, లబ్ధిదారుని వాటా కింద రూ.82 వేలు అని తెలిపారు. ఈ పథకం కింద 35 శాతం సబ్సిడీ వర్తిస్తుందని కలెక్టర్ తెలిపారు. కార్యక్రమంలో డీఆర్‌డీఏ పీడీ లవన్న పాల్గొన్నారు.
జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్‌కుమార్
పిల్లలను దత్తత ఇవ్వటం సంతోషదాయకం
జిల్లా మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ అధికారిణి ఆధ్వర్యంలో ఉన్న ఇద్దరు పిల్లలను దత్తత ఇవ్వటం ఎంతో సంతోషంగా ఉందని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్‌కుమార్ పేర్కొన్నారు. శిశు గృహంలో ఆశ్రయం పొందుతున్న ఇద్దరు పిల్లలను కలెక్టర్ చేతుల మీదుగా బెంగళూరు, చైన్నెకు చెందిన తల్లిదండ్రులకు కారా నూతన మార్గదర్శకాలు అనుసరించి శుక్రవారం దత్తత ఇచ్చారు. కలెక్టర్ మాట్లాడుతూ పిల్లలు లేని తల్లిదండ్రులు పిల్లల కోసం మిషన్ వాత్సల్య పోర్టల్‌లో నమోదు చేసుకుంటే ప్రభుత్వం నుంచి చట్టబద్ధంగా పిల్లల్ని దత్తత ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా మహిళా, శిశు సంక్షేమ సాధికారిత అధికారి డి.రాధామాదవి, జిల్లా బాలల పరిరక్షణ అధికారి పురుషోత్తరావు, కృష్ణ, రోజిలిన్ తదితరులు పాల్గొన్నారు.