ఉత్తమ వైద్య సేవలతో ప్రజాభిమానాన్ని పొందాలి
డీఎంహెచ్‌ఓ డాక్టర్ కొర్రా విజయలక్ష్మి
గుంటూరు మెడికల్: ప్రజలకు, రోగులకు ఉత్తమ వైద్య సేవలు అందించి అభిమానాన్ని పొందాలని గుంటూరు డీఎంహెచ్‌ఓ డాక్టర్ కొర్రా విజయలక్ష్మి పేర్కొన్నారు. శుక్రవారం గుంటూరు కొత్తపేట యడవల్లి వారి వీధిలో కిమ్స్ ఫెర్టిలిటీ అండ్ ఐవీఎఫ్ సెంటర్‌ను డిజాస్టార్ రెస్పాన్స్ అండ్ ఫైర్ సర్వీసెస్ డైరెక్టర్ పి.వెంకటరమణ, డీఎంహెచ్‌ఓ డాక్టర్ కొర్రా విజయలక్ష్మిలు ముఖ్య అతిథులుగా విచ్చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ కొర్రా విజయలక్ష్మి మాట్లాడుతూ ఆధునిక జీవన శైలి వల్ల సంతాన సమస్యలు ఎక్కువగా ఉంటున్నట్లు వెల్లడించారు. ఆధునిక చికిత్సలతో వారి కలలు నెరవేర్చుకోవచ్చని తెలిపారు. చికిత్స కోసం వచ్చే ప్రతి జంటకు శాసీ్త్రయ పరిష్కారాలతో ఆధునిక చికిత్సలతో భరోసా కల్పించాలన్నారు. తల్లిదండ్రులు కావాలనుకునే ప్రతి జంటకు కిమ్స్ ఐవీఎఫ్ సెంటర్ భరోసా ఇచ్చేలా చికిత్సలు అందించాలని కోరారు. జిల్లాలో తొలి ఎంసీహెచ్ సూపర్ స్పెషలిస్టులతో తమ కేంద్రంలో సంతానం లేని వారికి చికిత్స అందించేందుకు వైద్యులు అందుబాటులో ఉన్నారని కిమ్స్ యాజమాన్యం తెలిపింది. ఇన్ హౌస్ ఎంబ్రియాలజిస్ట్ అందుబాటులో ఉన్నారని, ప్రపంచ స్థాయి ఐవీఎఫ్ లేబరేటరీ, పరికరాలు ఉన్నాయన్నారు. ఐవీఎఫ్, ఇక్సి, ఐయూఐ, డోనర్, ప్రొగ్రామ్స్, ఫెర్టిలిటీ ప్రిజర్వేషన్, యండ్రాలజీ సేవలు తమ వద్ద అందుబాటులో ఉన్నాయన్నారు. హైరిస్క్ ఇన్‌ఫిర్టిలిటీ కేసులకు ఆధునిక పరిష్కార మార్గాలు జన్యు విశ్లేషణ, జనటిక్ ఎవల్యూషన్ సౌకర్యం ఉందన్నారు. కిమ్స్ శిఖర హాస్పటల్, కిమ్స్ సన్‌షైన్ హాస్పటల్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ సుధాకర్ జాదవ్, కిమ్స్ శిఖర హాస్పటల్ యూనిట్ హెడ్ డాక్టర్ ఎన్.వి.హరికుమార్, సీనియర్ ఫెర్టిలిటీ స్పెషలిస్ట్, రీప్రొడెక్టీవ్, ల్యాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ నాగప్రత్యూష, ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ డాక్టర్ శిరీష గురిజాల, ఎంబ్రియాలజిస్ట్ ఎల్.ఎం.ఉదయ్, జూనియర్ ఎంబ్రియాలజిస్ట్ నసీర్ అహ్మద్ ఖాన్, తదితరులు పాల్గొన్నారు.


