చదువు జీవితాన్నే మారుస్తుంది
కర్లపాలెం: చదువు జీవితాలనే మారుస్తుందని గుంటూరు డీఎస్పీ లక్ష్మయ్య చెప్పారు. పెదగొల్లపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగిన మెగా పేరెంట్స్ సమావేశానికి ఉపాధ్యాయుల ఆహ్వానం మేరకు డీఎస్పీ లక్ష్మయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చాలన్నా, పేదరికాన్ని విద్యార్థులు క్రమశిక్షణతో చదివి మంచి ఫలితాలు సాధించి ఉన్నత శిఖరాలకు చేరాలన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు మొబైల్ ఫోన్‌ను అందుబాటులో ఉంచవద్దని వారు చక్కగా చదువుకునేందుకు ప్రశాంతమైన వాతావరణాన్ని కల్పించాలని సూచించారు. కర్లపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగిన పేరెంట్స్ సమావేశంలో తహసీల్దార్ షాకీర్ పాషా, ఎంపీడీవో అద్దూరి శ్రీనివాసరావులు పాల్గొని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు కావలసిన అన్ని వసతులు ఉన్నాయని తెలిపారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చదివించుకోవాలని చెప్పారు.
డీఎస్పీ లక్ష్మయ్య


