పొగ బట్టిన బస్సు ! | - | Sakshi
Sakshi News home page

పొగ బట్టిన బస్సు !

Oct 27 2025 8:14 AM | Updated on Oct 27 2025 8:14 AM

పొగ బట్టిన బస్సు !

పొగ బట్టిన బస్సు !

పొగ బట్టిన బస్సు ! పట్నంబజారు (గుంటూరు ఈస్ట్‌): ఆర్టీసీ బస్సులు నిర్వహణ లోపంతో విషం చిమ్ముతున్నాయి. ఈ బస్సులు వదులుతున్న కాలుష్య కారక పొగ ప్రజారోగ్యంపై దుష్ప్రభావం చూపుతోంది. బస్సుల సైలెన్సర్‌ల నుంచి వచ్చే పొగ ప్రజల ఆయువు తీసుకుంటోంది. కాలం చెల్లిన బస్సులు తిప్పుతూ ప్రజారోగ్యాన్ని పణంగా పెడుతున్నారు. లక్షలాది కిలోమీటర్లు తిరిగినా... తుక్కుకు పంపాల్సిన వాహనాలను రోడ్లపై తిప్పుతున్నారు. గుంటూరు రీజియన్‌ పరిధిలో గుంటూరు 1, 2 డిపోలు, తెనాలి, మంగళగిరి, పొన్నూరు డిపోలు ఉన్నాయి. అన్నిటా కలిపి 410 బస్సుల వరకు ఉంటాయి. వీటిలో అధిక శాతం సుమారు 250 వరకు పల్లె వెలుగు బస్సులను ఆయా రూట్లకు కేటాయించారు. వాటిలో కాలం చెల్లిన వాహనాలు ఉన్నాయని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ, ప్రైవేట్‌ వాహనం ఏదైనా 15 ఏళ్ల తరువాత స్క్రాప్‌కు పంపాలనే నిబంధనలు ఉన్నాయి. అదే విధంగా 15 లక్షల కిలోమీటర్లు దాటిన వాహనాలను కూడా తిప్పకూడదు. ప్రైవేట్‌ వాహనాలకు సంబంధించి మరో ఐదేళ్లకు రెన్యూవల్‌ చేసుకునే అవకాశం ఉంటుంది. ఆర్టీసీ కాలం చెల్లిన బస్సులతో పబ్బం గడుపుతోంది. వీటి నుంచి వచ్చే నల్లటి పొగ రోడ్లను కప్పేస్తూ.. గాలిలోకి ప్రమాదకర రసాయనాలు విడుదల చేస్తున్నాయి. తెనాలి, పొన్నూరు, బాపట్ల, సత్తెనపల్లి, పిడుగురాళ్ల, చిలకలూరిపేట, అమరావతి, మంగళగిరితోపాటు పలు ప్రాంతాలకు తిప్పుతున్న పల్లె వెలుగు బస్సులు కాలం చెల్లినవేనని రిజిస్ట్రేషన్‌ ద్వారా తెలుస్తోంది. అయినప్పటికీ వీటిని పరిశీలించాల్సిన రోడ్డు ట్రాన్స్‌పోర్ట్‌ అధికారులు (ఆర్టీఏ) అధికారులు మాత్రం మొద్దు నిద్ర వీడటం లేదు. కూటమి ప్రభుత్వం వచ్చాక జిల్లా అధికారిగా బాధ్యతలు చేపట్టిన అధికారి నెలలో 20 రోజులు సెలవులో ఉంటున్నారని కార్యాలయ సిబ్బంది చెబుతున్నారు.

నిర్వహణ లోపమే..

ఆర్టీసీ అధికారుల నిర్వహణ లోపం కారణంగా నే డీజిల్‌ బస్సులు ప్రజల మొహాలపై పొగలు కక్కుతున్నాయి. ప్రధానంగా ఇంజిన్‌లోని ఫ్యూయల్‌ స్ప్రే ఇంజెక్టర్లకు సరైన మరమ్మతులు జరగక పొగ వస్తోందని గ్యారేజీల్లోని సిబ్బంది స్పష్టంగా చెబుతున్నారు. మరమ్మతులకు గురై న స్ప్రే ఇంజెక్టర్లు..పిస్టన్‌ పైకి చుక్కలు చుక్క లుగా పడుతుందని, ఆ విధంగా పడిన చుక్క బర్న్‌ కాకుండా నేరుగా సైలెన్సర్‌లోకి చేరి, అక్క డ నుంచి నల్లటి పొగ రూపంలో బయటకు వచ్చేస్తుందని తెలుస్తోంది. నిర్ణీత కిలోమీటర్లకు ఎయిర్‌ ఫిల్టర్లు క్లీన్‌ చేయక పోవడం/మార్చకపోవడం, ఫ్యూయల్‌ నాణ్యత తదితర కారణా లు సైతం బస్సుల ఫిట్నెస్‌లను తగ్గించి పర్యావరణానికి పెనుసవాల్‌ విసురుతున్నాయి.

డ్రైవర్లపై నెపం నెట్టేస్తూ ....

సకాలంలో, సక్రమంగా బస్సుల ఇంజిన్‌లకు మరమ్మతులు చేయించడంలో విఫలమవుతున్న అధికారులు..బస్సుల నుంచి వచ్చే నల్లటి పొగ నెపాన్ని డ్రైవర్లపై నెట్టేస్తున్నారు. గతంలో పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్‌ బస్సుల నుంచి అధికంగా వస్తున్న క్రమంలో అది డ్రైవర్‌ల డ్రైవింగ్‌ తీరుతో వస్తోందంటూ.. కబుర్లు చెబుతున్నారు. వాహనాల నుంచే నల్లటి పొగలో కార్బన్‌ మోనాకై ్సడ్‌ ఎక్కువగా ఉంటుంది. గాలిలో కలిసిన కార్బన్‌ మోనాకై ్సడ్‌ను పీల్చటం ద్వారా శ్వాసకోశ నాళాలు దెబ్బతింటాయని వైద్యులు చెబుతున్నారు. కోపోక్లోనిక్‌ అవ్యస్ట్రక్టివ్‌ వంటి పలన్మరీ రోగాలు, దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడతారని పలు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఇంకా చర్మవ్యాధులు రావడం, తల వెంట్రుకలు ఊడిపోవడం, కళ్లు పాడిబారిపోవడం, ఊపిరితిత్తులు దెబ్బతినడం జరుగుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

ఆర్టీసీ బస్సు నుంచి వస్తున్న నల్లటి పొగ

కాలం చెల్లిన బస్సులతో...

ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావం

నిర్వహణ లోపంతో విషం చిమ్ముతున్న

ఆర్టీసీ బస్సులు

దారి పొడవునా నల్లని పొగతో

ప్రజల అవస్థలు

15 సంవత్సరాలకు పైబడిన

వాహనాలు సైతం రోడ్లపైకి..

నిద్రావస్థలో ఆర్టీసీ, ఆర్టీఏ అధికారులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement