తుపానును ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి | - | Sakshi
Sakshi News home page

తుపానును ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి

Oct 27 2025 8:14 AM | Updated on Oct 27 2025 8:14 AM

తుపానును ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి

తుపానును ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి

తుపానును ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి

బాపట్ల: తుపాను ప్రభావం వల్ల ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ వి.వినోద్‌కుమార్‌ ఆదేశించారు. ఆదివారం ఉదయం జిల్లా కలెక్టరేట్‌లోని న్యూ వీడియో కాన్ఫరెన్స్‌ హాలులో ఏర్పాటు చేసిన కమాండ్‌ కంట్రోలో రూంలో రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ప్రత్యేక అధికారి వేణుగోపాల్‌రెడ్డి, ఎస్పీ ఉమామహేశ్వర్‌, జాయింట్‌ కలెక్టర్‌ భావనలతో కలసి కలెక్టర్‌ జిల్లాలో తీసుకున్న ముందస్తు చర్యలపై సమీక్షించారు. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి వారికి అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పించాలని అన్నారు. తాగునీటి సరఫరాకు ఇబ్బందులు లేకుండా సిద్ధంగా చేయాలని, ఓవర్‌ హెడ్‌ ట్యాంకుల్లో క్లోరినేషన్‌ పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. గ్రామంలో మురుగు నిలిచి అంటువ్యాధులు వ్యాప్తి చెందకుండా బ్లీచింగ్‌ పౌడర్‌, హైపోక్లోరైట్‌ ద్రావణం పిచికారీ చేయాలన్నారు. జిల్లాలో పోలీసు, ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు సిద్ధంగా ఉండాలన్నారు. జిల్లా, డివిజన్‌, నియోజకవర్గం, మండల స్థాయి అధికారులు ఒక టీమ్‌గా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. తీర ప్రాంతంలోని ఎనిమిది మండలాల పరిధిలో 108 హ్యాబిటేషన్లు ఏర్పాటు చేసి అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పించామని తెలిపారు. ప్రతి సచివాలయ పరిధిలో జేసీబీలు, ట్రాక్టర్లు, ట్రాన్స్‌ఫార్మర్‌, జనరేటర్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జిల్లా కేంద్రంలో కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌తోపాటుగా రెవెన్యూ డివిజన్ల పరిధిలోని మండల కేంద్రాల్లోనూ కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేశామని, అక్కడ 24 గంటలు అధికారులు అందుబాటులో ఉంటారని తెలిపారు. ప్రత్యేక అధికారి వేణుగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ తుపానును ఎదుర్కొనడానికి జిల్లా కలెక్టర్‌ మంచి ప్రణాళిక సిద్ధం చేశారని అన్నారు. రిలీఫ్‌ కేంద్రాలలో ఉన్న ప్రత్యేక అధికారులు, ఇన్‌చార్జిలు అన్ని రకాలుగా సిద్ధంగా ఉండాలన్నారు. జిల్లా, రాష్ట్ర స్థాయి నుంచి వచ్చే సమాచారాన్ని అధికారులు ప్రజలకు తెలియజేయలన్నారు. ఎక్కడైనా రహదారులు దెబ్బతింటే వెంటనే ప్రత్యామ్నాయ మార్గాలను ఏర్పాటు చేసి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా చూడాలని అన్నారు. క్షేత్రస్థాయిలో ఏమైనా ఇబ్బందులు ఉంటే వెంటనే జిల్లా కలెక్టర్‌ దృష్టికి తీసుకురావాలని సూచించారు. సమావేశంలో జిల్లా కలెక్టరేట్‌ ఏఓ మల్లికార్జునరావు, డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ విజయమ్మ, డీఈ ఓ.పురుషోత్తం, డ్వామా పీడీ విజయలక్ష్మి, కోఆర్డినేటర్‌ యశ్వంత్‌, డీఎల్‌డీఓ విజయలక్ష్మి, మహిళా సంక్షేమ శాఖ పీడీ రాధామాధవి వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ వి.వినోద్‌కుమార్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement