గుడి అయితే మాకేంటీ..!
చీరాల: గుడి అయినా, బడి అయితే ఏంటి మా వ్యాపారాలు బాగుండాలి ఇదే ప్రస్తుతం వైన్‌షాపుల నిర్వాహకుల వాక్కు. మద్యం షాపుల టెండర్లు దక్కించుకున్న వారు వైన్‌షాపుల ఏర్పాటులో నిబంధనలకు పాతరేశారు. ప్రార్థనా మందిరాలు, పాఠశాలలకు, హాస్పిటళ్లకు వంద మీటర్లు దూరంగా మద్యం షాపులు ఉండాలనే నిబంధనలు ఉన్నా.. అవేమి పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. చీరాల ప్రసాద్ థియేటర్ సమీపంలో వీరాంజనేయస్వామి దేవాలయం చీరాల–ఒంగోలు ప్రధాన రహదారిపై ఉంది. ఎంతో పవిత్రమైన దేవాలయానికి కొద్దిదూరంలోనే వైన్‌షాపును ఏర్పాటు చేశారు. దేవాలయానికి వచ్చే భక్తులు, వాహనదారులు రాకపోకలు సాగిస్తుంటారు. దేవాలయానికి కూతవేటు దూరంలో వైన్‌షాపు ఏర్పాటు చేసి అమ్మకాలు సాగిస్తున్నారు.


