నమ్మండీ.. ఇవీ రోడ్లేనండీ !
కూటమి ప్రభుత్వంలో రోడ్లు అద్దంలా ఉన్నాయి..పాలు పోసి పాలు ఎత్తుకోవచ్చు అంటూ ఓవైపు అధికారపార్టీ నేతలు ప్రగల్బాలు పలుకుతున్నారు. 2025 సంక్రాంతికి గుంతలు లేని రోడ్లు అంటూ సీఎం, డిప్యూటీ సీఎంలు ఊదరగొట్టారు. సంక్రాంతితో పాటు దీపావళి కూడా పోయింది, మళ్లీ సంక్రాంతి వస్తోంది అయినా జిల్లాలో రోడ్ల పరిస్థితిలో ఏమాత్రం మార్పు లేకపోగా మరింత గుంతల మయమయ్యాయి. ఇటీవల కురుస్తున్న వర్షాలకు రోడ్లు ఏవో.. నారు మళ్లు ఏవో తెలియని విధంగా బురదమయంగా మారాయి. అడుగుకో మడుగును తలిపిస్తూ వాహనదారులకు పగలే చుక్కలు చూపిస్తున్నాయి.
– కొల్లూరు/వేమూరు/
పర్చూరు(చినగంజాం)
నమ్మండీ.. ఇవీ రోడ్లేనండీ !
నమ్మండీ.. ఇవీ రోడ్లేనండీ !
నమ్మండీ.. ఇవీ రోడ్లేనండీ !


