మృతుడు ఇసుకదర్శి గ్రామ నివాసిగా గుర్తింపు | - | Sakshi
Sakshi News home page

మృతుడు ఇసుకదర్శి గ్రామ నివాసిగా గుర్తింపు

Oct 20 2025 7:50 AM | Updated on Oct 20 2025 7:50 AM

మృతుడ

మృతుడు ఇసుకదర్శి గ్రామ నివాసిగా గుర్తింపు

మార్టూరు: ఇసుకదర్శి వ్యవసాయ భూముల్లోని నేల బావిలో పడి మృతి చెందిన గుర్తు తెలియని వ్యక్తిని ఆదివారం బంధువులు గుర్తించారు. మృతదేహాన్ని శనివారం గుర్తించి పోలీసులు వెలికి తీసిన సంగతి తెలిసిందే. శరీరంపై బట్టలు, కుడి చేతికి కాశీ దారం తదితర వివరాల ప్రకారం ఇసుక దర్శి గ్రామానికి చెందిన మారెళ్ల శ్రీనివాసరావు (52 )గా తేలింది. ఐదు రోజుల కిందట ఇంటి నుంచి వెళ్లిన అతడు తిరిగి రాలేదని కుటుంబ సభ్యులు తెలిపారు. అప్పుడప్పుడు బయటకు వెళ్లి, కొన్నిసార్లు పది రోజుల తర్వాత ఇంటికి రావడం మామూలేనని చెప్పారు. ఈ నెల 13న శ్రీనివాసరావు ఇంటి నుంచి వెళ్లి పోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆర్థిక లావాదేవీలు గానీ, గొడవలు గానీ లేవన్నారు. పోస్టుమార్టం అనంతరం పోలీసులు మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు.

తాళం వేసిన ఇంట్లో భారీ చోరీ

రెండు సవర్ల బంగారు ఆభరణాలు మాయం

యడ్లపాడు: మండలంలోని కోట గ్రామంలో తాళం వేసిన ఓ ఇంట్లో భారీ దొంగతనం జరిగింది. యజమాని ఊరు వెళ్లిన సమయంలో దుండగులు చొరబడి బంగారం, వెండి, ఇత్తడి వస్తువులను అపహరించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... కోట గ్రామానికి చెందిన షేక్‌ ఖైరున్నీసా ఈనెల 16వ తేదీ మధ్యాహ్నం నరసరావుపేటలోని తన కోడలి ఇంటికి వెళ్లింది. రెండురోజుల తర్వాత 18వ తేదీ సాయంత్రం గ్రామానికి తిరిగి రాగా ఇంట్లో వస్తువులు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. ఇంట్లోకి వెళ్లి చూడగా గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేసినట్లు గుర్తించింది. 12 గ్రాముల బంగారు గొలుసు, 4 గ్రాముల చెవిదుద్దులు, వెండి పట్టీలు, ఇత్తడి సామగ్రి అపహరణకు గురైనట్లు ప్రాథమిక విచారణలో పోలీసులు గుర్తించారు. బాధితురాలి ఫిర్యాదుతో ఆదివారం కేసు నమోదు చేశారు. వెంటనే క్లూస్‌ టీమ్‌తో కలిసి సంఘటన స్థలానికి చేరుకుని, ఆధారాలను సేకరించి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ టి.శివరామకృష్ణ తెలిపారు.

పిచ్చికుక్క స్వైర విహారం

15 మందికి గాయాలు

గురజాల: పిచ్చి కుక్క స్వైర విహారం చేసి 15 మందిని గాయపర్చింది. నగర పంచాయతీ పరిధిలోని శ్రీరాంపురం రోడ్డులో ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు పిచ్చి కుక్క కనిపించిన వారిని కనిపించినట్లు కరుస్తూ వెళ్తుంది. కుక్క దాడిలో 15 మందికి గాయాలు కాగా గురజాలలోని సామాజిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లి ప్రథమ చికిత్స చేయించుకున్నారు. నగర పంచాయతీ అధికారులు, రెవెన్యూ అధికారులు స్పందించి కుక్కలను పట్టించి అడవిలో వదిలి వేయాలని కోరుతున్నారు. పలుమార్ల్లు ఫిర్యాదు చేసినా అధికారులు స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు

యాచకుడికి అంత్యక్రియలు

మాదల(ముప్పాళ్ళ): మండలంలోని మాదల గ్రామం వద్ద మృతి చెందిన యాచకుడికి పంచాయతీ, పోలీసు సిబ్బంది ఆదివారం అంత్యక్రియలు జరిపారు. సంఘటనకు సంబంధించి స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి... ఆలేటి యాదగిరి(46) అనే దివ్యాంగుడు సుమారు 25 సంవత్సరాల కిందట మాదల గ్రామానికి వచ్చాడు. దేవుడు గుడి, సమీపంలోని పాఠశాలల వద్ద ఉంటూ గ్రామస్తులు ఇచ్చే ఆహారం తింటూ జీవనం సాగిస్తుండేవాడు. యాదగిరికి రెండు చేతులు సరిగ్గా ఉండవు. ఈక్రమంలో ఆదివారం సత్తెనపల్లి – నరసరావుపేట ప్రధాన రహదారి పక్కనే ఉన్న సత్రం గోడ వద్ద యాదగిరి అపస్మారక స్థితిలో ఉండటాన్ని గమనించిన స్థానికులు జవంగుల సాంబశివరావు సత్రం లోపలికి తీసుకెళ్లి కూర్చోబెట్టారు. కొద్దిసేపటికి మృతి చెందటంతో సమాచారాన్ని పోలీసులకు అందించారు. పంచాయతీ సిబ్బంది, పోలీసులు సమన్వయంతో అంత్యక్రియలు నిర్వహించారు.

మృతుడు ఇసుకదర్శి గ్రామ నివాసిగా గుర్తింపు  1
1/3

మృతుడు ఇసుకదర్శి గ్రామ నివాసిగా గుర్తింపు

మృతుడు ఇసుకదర్శి గ్రామ నివాసిగా గుర్తింపు  2
2/3

మృతుడు ఇసుకదర్శి గ్రామ నివాసిగా గుర్తింపు

మృతుడు ఇసుకదర్శి గ్రామ నివాసిగా గుర్తింపు  3
3/3

మృతుడు ఇసుకదర్శి గ్రామ నివాసిగా గుర్తింపు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement