అద్దంకి: వైఎస్సార్ సీపీ విధానాలకు ఆకర్షితులైన పలు కుటుంబాలు టీడీపీని వీడి పార్టీలో చేరాయి. పట్టణంలోని 13వ వార్డుకు చెందిన ముస్లిం, యాదవ, ఎస్టీ వర్గానికి చెందిన 50 కుటుంబాలు ఆదివారం పట్టణ అధ్యక్షుడు కాకాని రాధాకృష్ణమూర్తి, ఎస్సీ సెల్ అధ్యక్షుడు లక్కెనబోయిన రవి, చిట్టిబోయిన శ్రీనాథ్, దొడపాటి వెంకట్రావు ఆధ్వర్యంలో వైఎస్సార్ సీపీలో చేరాయి. నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ చింతలపూడి అశోక్‌కుమార్ పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఆయన మాట్లాడుతూ ఇది మార్పునకు తొలి అడుగు కావాలన్నారు. టీడీపీలో చీలిక మొదలైందని చెప్పారు. పార్టీలో చేరిన వారు కష్టాలు, ఇబ్బందులు పడే అవకాశం ఉందని, అయితే తాను తోడుగా ఉంటానని భరోసా కల్పించారు. మరో రెండు సంవత్సరాలు ఓపిక పడితే కష్టానికి తగిన ఫలితం దక్కుతుందని చెప్పారు.
వైఎస్సార్ సీపీలో చేరిన 50 కుటుంబాలు