చీఫ్‌ జస్టిస్‌ గవాయ్‌పై దాడి హేయం | - | Sakshi
Sakshi News home page

చీఫ్‌ జస్టిస్‌ గవాయ్‌పై దాడి హేయం

Oct 8 2025 6:53 AM | Updated on Oct 8 2025 6:53 AM

చీఫ్‌

చీఫ్‌ జస్టిస్‌ గవాయ్‌పై దాడి హేయం

కళ్లకు నల్ల రిబ్బన్‌తో నిరసన..

రేపల్లె బార్‌ అసోసియేషన్‌

విధులు బహిష్కరించి నిరసన

రాజ్యాంగంపై దాడిగా అభివర్ణించిన దళిత హక్కుల పరిరక్షణ

సమితి నాయకులు

రేపల్లె: దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ బీఆర్‌ గవాయిపై న్యాయవాది రాకేష్‌ అనుచితంగా ప్రవర్తించటంపట్ల రేపల్లె బార్‌ అసోసియేషన్‌ న్యాయవాదులు మంగళవారం విధులను బహిష్కరించారు. స్థానిక డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహం సెంటరులో రేపల్లె బార్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో న్యాయవాదులు పాల్గొని దాడికి పాల్పడిన నిందితుడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా న్యాయవాదులు మాట్లాడుతూ ప్రధాన న్యాయమూర్తిపై దాడి చేయటమంటే రాజ్యాంగంపై దాడి చేయటమేనన్నారు. రాకేష్‌ను న్యాయవాద వృత్తి నుంచి శాశ్వతంగా బహిష్కరణ చేయటంతో పాటు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో అదనపు పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ అనగాని శ్రీనివాసమూర్తి, రేపల్లె బార్‌ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి ఉప్పాల శ్రీనివాసరావు, మాజీ ప్రభుత్వ సహాయ న్యాయవాదులు దారం సాంబశివరావు, కర్రా ఐజాక్‌, న్యాయవాదులు గుంటూరు విజయ కుమారి, కట్టుపల్లి కాకమ్మ, ఎం.వెంకటేశ్వరరావు, గుడిపల్లి రవి, గురిందపల్లి రామారావు, నాలాది పోతురాజు, రేవు నాగరాజు, గుమ్మడి కుమార్‌ బాబు, మునిపల్లి సుబ్బయ్య, కర్రా జయరావు, నల్లూరి వెంకటేశ్వరరావు, దోవా రమేష్‌ రాంజీ తదితరులు పాల్గొన్నారు.

దాడి అమానుషం..

చీరాల రూరల్‌: సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌పై షూ విసిరి దాడిచేసేందుకు న్యాయవాది ప్రయత్నించడంపై మంగళవారం ఆగ్రహం పెల్లుబికింది. దళిత హక్కుల పరిరక్షణ సమితి నాయకులు, ఆల్‌ ఇండియా డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ ఆర్మీ నాయకులు మాట్లాడుతూ ఇది భారత రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, న్యాయవ్యవస్థలపై దాడిగా అభివర్ణించారు. చీరాల బార్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో న్యాయవాదులు తమ విధులు బహిష్కరించి నిరసన తెలిపారు. తక్షణమే సీజేఐపై దాడికి యత్నించిన న్యాయవాదిపై చర్యలు తీసుకోవాలని ముక్తకంఠంతో కోరారు. దళిత హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు నీలం నాగేంద్రరావు మంగళవారం స్థానిక దళిత మహాసభ కార్యాలయంలో మాచవరపు జూలియన్‌ అద్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని మాట్లాడారు. దేశ అత్యున్నతమైన న్యాయస్థానం సుప్రీంకోర్టు సాక్షిగా సీనియర్‌ న్యాయవాది రాకేష్‌ కిషోర్‌.. సనాతన ధర్మాన్ని సీజేఐ బీఆర్‌ గవాయ్‌ అవహేళన చేశారని ఆరోపిస్తూ.. తన కాలిబూటు విసిరి దాడి చేసేందుకు యత్నించాడన్నారు. లౌకిక భారతదేశంలో సనాతనం పేరుతో అరాచకాలు పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. మోదీ ప్రభుత్వ హయాంలో మతోన్మాదం పెరిగిపోతోందని, కరుడు కట్టిన ఆర్‌ఎస్‌ఎస్‌ భావజాలం జడలు విప్పుతోందని ఈ దాడివెనుక బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ కుట్ర దాగి ఉందని ఆరోపించారు. తక్షణమే దాడికి యత్నించిన న్యాయవాదిపై చర్యలు తీసుకోవాలని కోరారు. మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు దారా అంజయ్య, బాపట్ల జిల్లా ఎంఎస్పీ అధ్యక్షుడు తేళ్ల జయరాజు, దళిత నాయకులు కాకుమాను రవి, గొర్రెముచ్చు ఏలియా తదితరులు పాల్గొన్నారు.

విధులు బహిష్కరించిన న్యాయవాదులు

దేశ అత్యున్న న్యాయస్థానం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బీఆర్‌ గవాయ్‌పై న్యాయవాది బూటువిసిరి దాడిచేసేందుకు ప్రయత్నించినందుకు నిరసనగా మంగళవారం చీరాల బార్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో న్యాయవాదులు తమ విధులను బహిష్కరించి నిరసన తెలియజేశారు. ప్రజాస్వామ్యం దేశంలో ఇటువంటి సంఘటనలు జరగడం దురదృష్టకరమని బార్‌ అసోసియేషన్‌ అధ్యక్ష, కార్యదర్శులు గౌరవ రమేష్‌బాబు, మేరుగ రవికుమార్‌లు పేర్కొన్నారు.

చీరాల రూరల్‌: ఆల్‌ ఇండియా డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ ఆర్మీ నేషనల్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ మార్పు దీనరాజు.. చీరాల గడియార స్తంభం సెంటర్లో కళ్లకు నల్ల రిబ్బన్‌ కట్టుకుని నిరసన తెలియజేశారు. దేశ అత్యున్నత న్యాయస్థానంలో చీఫ్‌ జస్టి స్‌గా ఉన్న వ్యక్తిపై దాడి జరిగితే సామాన్యుల పరిస్థితి ఏవిధంగా ఉంటుందోనని ఆందోళన వ్యక్తం చేశారు. కుల, మతాల మధ్య చిచ్చు పెట్టే విధానాన్ని తీవ్రంగా ఖండించారు. న్యాయవాదిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

చీఫ్‌ జస్టిస్‌ గవాయ్‌పై దాడి హేయం 1
1/1

చీఫ్‌ జస్టిస్‌ గవాయ్‌పై దాడి హేయం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement