
భగవతి పద్మావతి అమ్మవారికి సారె
తెనాలి టౌన్: రూరల్ మండలం బుర్రిపాలెం గ్రామంలో వేంచేసియున్న శ్రీ పరంజ్యోతి భగవతి పద్మావతి అమ్మవారికి శనివారం ఆషాడ మాస సారె సమర్పించారు. అమ్మవారిని శ్రీ శాకంబరి దేవిగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. తెనాలి, పరిసర ప్రాంతాల నుండి భక్తులు విశేష సంఖ్యలో తరలివచ్చి సారె సమర్పించారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు అన్నప్రసాద వితరణ చేశారు. భక్తుల కోర్కెలు తీర్చే అమ్మవారిని దర్శించుకుని భక్తులు తన్మయం చెందారు. ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
శాకంబరిగా అమ్మవారు ప్రత్యేక దర్శనం
బాపట్ల అర్బన్: ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని నందిరాజుతోటలోని గంగా పార్వతీ సమేత ఓంకార బ్రహ్మలింగేశ్వరస్వామి దేవాలయంలో శనివారం పార్వతి అమ్మవారు శాకంబరి అలంకారంలో భక్తులకు దర్శనం ఇచ్చారు. పలు కాయగూరలతో శోభాయమానంగా అలంకరించారు. భక్తులు పెద్దసంఖ్యలో దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం ఆరు గంటలకు ఆలయ ప్రధాన అర్చకులు శర్మ ఆధ్వర్యంలో అమ్మవారికి అంగరంగ వైభవంగా కుంకుమ పూజ నిర్వహించారు. యాభై మంది భక్తులు పాల్గొని, అమ్మవారి ఆశీస్సులు పొందారు.
565 అడుగులకు చేరిన సాగర్ నీటి మట్టం
విజయపురిసౌత్: నాగార్జుసాగర్ జలాశయ నీటి మట్టం శనివారం 565 అడుగులకు చేరింది. ఇది 244.1480 టీఎంసీలకు సమానం. సాగర్ జలాశయం నుంచి ఎస్‌ఎల్‌బీసీకి 1,800 క్యూసెక్కులు విడుదలవుతోంది. శ్రీశైలం నుంచి సాగర్ జలాశయానికి 67,800 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది.
మోపిదేవి ఆలయంలో ఆర్వో ప్లాంట్లు ప్రారంభం
మోపిదేవి: స్థానిక శ్రీవల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి దేవస్థాన ప్రాంగణంలో దివీస్ లెబోరేటరీస్ లిమిటెడ్ రూ.32 లక్షలతో ఏర్పాటు చేసిన రెండు ఆర్వో ప్లాంట్లను ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ శనివారం ప్రారంభించారు. దివీస్ ల్యాబ్ ప్రతినిధులు నగేష్, శ్రీనివాస్‌ను ఆలయ ఈఓ శ్రీరామవరప్రసాదరావు ఆధ్వర్యంలో వేద పండితులు ఘనంగా సత్క రించారు. ఆశీర్వచనాలు అందజేసి స్వామి చిత్రపటం బహూకరించారు.
దుర్గమ్మ సేవలో ప్రముఖులు
ఇంద్రకీలాద్రి: విజయవాడ దుర్గమ్మను విశ్రాంత ఐపీఎస్ అధికారి రమణకుమార్, ఐఏఎస్ అధికారి ఉదయలక్ష్మి శనివారం దర్శించుకున్నారు. అమ్మకు ప్రత్యేక పూజలు చేయించారు.
ముగిసిన పవిత్రోత్సవాలు
మోపిదేవి: మోపిదేవిలో వేంచేసిన శ్రీవల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి పవిత్రోత్సవాలు ముగిశాయి. శనివారం ఉదయం పూర్ణాహుతి నిర్వహించారు.

భగవతి పద్మావతి అమ్మవారికి సారె

భగవతి పద్మావతి అమ్మవారికి సారె

భగవతి పద్మావతి అమ్మవారికి సారె

భగవతి పద్మావతి అమ్మవారికి సారె

భగవతి పద్మావతి అమ్మవారికి సారె