
అనుగురాజు కాంస్య విగ్రహానికి రూపకల్పన
తెనాలి: పన్నెండో శతాబ్దంలో పల్నాడును పరిపాలించిన అనుగురాజు విగ్రహాన్ని తెనాలికి చెందిన ప్రముఖ శిల్పులు కాటూరి వెంకటేశ్వరరావు, రవిచంద్రలు రూపొందించారు. ఆయన చరిత్రకు సంబంధించిన ఫొటోలు అందుబాటులో లేకపోవడంతో ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి, విగ్రహ కమిటీ సూచనతో శిల్పకారులు పలు డ్రాయింగులు, కంప్యూటర్ డిజైన్లను తయారుచేశారు. ఆ ప్రకారం తొమ్మిది అడుగుల నమూనాను తయారుచేసి కమిటీ సంతృప్తిని వ్యక్తంచేశాక 700 కిలోల కాంస్యాన్ని వినియోగించి అనుగురాజు విగ్రహాన్ని సిద్ధం చేశారు. చారిత్రక ఆధారాల ప్రకారం అనుగురాజు మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని జబల్పూర్ ప్రాంతం నుంచి వచ్చి పల్నాడును పరిపాలించారు. ఆయన శరీరాకృతి, వస్త్రధారణను ఊహించి విగ్రహాన్ని రూపొందించామని శిల్పులు కాటూరి వెంకటేశ్వరరావు, రవిచంద్ర చెప్పారు. ఈ విగ్రహాన్ని పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గంలోని పిడుగురాళ్లలో గంగమ్మతల్లి గుడి ఎదురుగా ప్రతిష్టించనున్నారు. విగ్రహ కమిటీ సభ్యులు, అనుగురాజు యాదవ్ అభిమానులతో గురువారం ఆ విగ్రహాన్ని పల్నాడుకు తీసుకువెళ్లారు.
పిడుగురాళ్లలో ప్రతిష్ట నిమిత్తం రూపొందించిన తెనాలి శిల్పులు 12వ శతాబ్దంలో పల్నాడును పాలించిన అనుగురాజు 700 కిలోల కంచుతో తొమ్మిది అడుగుల నిలువెత్తు విగ్రహం