
క్రీడాకారులకు ఆర్థోస్కోపీతో ఉపశమనం
గుంటూరుమెడికల్: ఆటలు ఆడే సమయంలో పలువురు గాయపడుతుంటారని, గాయాల ద్వారా క్రీడాలకు దూరంగా కాకుండా ఆర్థోస్కోపీతో వారికి సమస్య నుంచి శాశ్వత పరిష్కారం లభిస్తుందని ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్, గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ యశస్వి రమణ అన్నారు. గుంటూరు ఆర్థోపెడిక్ అసోసియేషన్, గుంటూరు ఆర్ర్‌ధోస్కోపీ అకాడమీ ఆధ్వర్యంలో ఆదివారం గుంటూరు ఐటీసీ హోటల్‌లో ఆర్ర్‌ధోస్కోపీ కాన్ఫరెన్‌న్స్ నిర్వహించారు. డాక్టర్ యశస్వి రమణ మాట్లాడుతూ స్పోర్ట్స్ పర్సన్‌కు గాయాలు ఎక్కువగా అవుతాయని చెప్పారు. కీడ్రల్లో యువత ఎక్కువగా భాగస్వాములుగా ఉంటారన్నారు. ఆటలు ఆడే సమయంలో ఏదైనా దెబ్బ తగిలితే త్వరగా గాయాల నుంచి కోలుకుని ఉద్యోగాలు చేసుకోవటానికి, తిరిగి ఆటలు ఆడటానికి ఆర్థోస్కోపీ సర్జరీలు ఎంతో ఉపయోగపతాయని వివరించారు. ఈ సర్జరీతో క్రీడాగాయాలైన వారు త్వరగా కోలుకుంటారని, త్వరగా నడుస్తారని చెప్పారు. వచ్చే ఐదేళ్లలో ఆర్థోస్కోపీ మెడికల్ టూరిజం అభివృద్ధి చెందాలని కోరారు. గుంటూరు మెడికల్ హబ్ అవుతుందని వెల్లడించారు. గుంటూరు కొత్తపేటలోని సంకల్ప హాస్పిటల్‌లో యువ వైద్యులకు, జూనియర్ వైద్యులకు, ప్రాక్టీస్‌లో ఆసక్తి ఉన్నవారికి షోల్డర్ అండ్ నీ లైవ్ సర్జరీలు లైవ్‌లో నాలుగు చేసి చూపించారు. షోల్డర్ అండ్ నీ సంకల్ప హాస్పిటల్‌లో పలు ప్రాంతాల నుంచి వచ్చిన సీనియర్ ఆర్థోస్కోపీ సర్జన్స్ నాలుగు లైవ్ సర్జరీలు చేశారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి 180 మంది యువవైద్యులు హాజరైనట్లు కాన్ఫరెన్స్ ఆర్గనైజింగ్ చైర్మన్ డాక్టర్ శివ కుమార్ మామిళ్ళపల్లి, ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ చైతన్య ఘంటా తెలిపారు. దేశంలోని వివిధ ప్రాంతాలనుండి వచ్చిన ఆర్థోస్కోపీ నిపుణులు లైవ్ సర్జరీలు నిర్వహించడమే కాకుండా వర్క్ షాప్ కూడా నిర్వహించారన్నారు.
జీజీహెచ్ సూపరింటెండెంట్ యశస్వి రమణ