
కార్మికుల బకాయిలు వెంటనే చెల్లించాలి
బాపట్ల టౌన్ : ఆర్టీసీ కార్మికులకు బకాయిలు వెంటనే చెల్లించాలని ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు పలిశెట్టి దామోదరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పట్టణంలోని ఎంఎస్‌ఆర్ కల్యాణ మండపంలో ఆదివారం ఆర్టీసీ ఎంప్లాయీస్ జిల్లా కార్యదర్శి వై. శ్రీనివాసరావు ఉద్యోగ విరమణ కార్యక్రమాన్ని నిర్వహించారు. దామోదరరావు మాట్లాడుతూ ఆర్టీసీలో రిటైరైన ఉద్యోగులకు, మరణింంచిన ఉద్యోగుల కుటుంబ సభ్యులకు చెల్లించాల్సిన గ్రాట్యుటీ, లీవ్‌ఎన్ క్యాష్మెంట్ సెటిల్‌మెంట్ చెల్లింపులు సంవత్సరాలు గడుస్తున్నాసరే జరగడం లేదన్నారు. ఆర్టీసీ ఉద్యోగులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. వీరికి చెల్లించాల్సిన బకాయిలు వెంటనే ప్రభుత్వం చెల్లించి ఆ కుటుంబాలను ఆదుకోవాలన్నారు. 11వ పీఆర్సీ చెందిన 24 నెలలు బకాయిలు, డీఏ మంజూరు, డీఏ అరియర్స్ వెంటనే చెల్లించాలన్నారు. ఉద్యోగులు ఉద్యమాల బాట పట్టకుండా చూడాలన్నారు. ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ప్రధానకార్యదర్శి జి.నారాయణరావు మాట్లాడుతూ ప్రభుత్వం ఆగస్టు 15 నుంచి మహిళలకు ఇవ్వాలనుకున్న ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలు చేయకముందే మూడు వేల ఆర్టీసీ బస్సులు కొనుగోలు చేయాలని, తక్షణమే వివిధ కేటగిరుల్లో 10 వేల మంది సిబ్బందిని నియమించుకొనేందుకు ప్రభుత్వం అనుమతులు ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.వి.నరసయ్య, బాపట్ల జిల్లా ఏపీజెఏసీ అమరావతి చైర్మన్ సురేష్ , ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్రకోశాధికారి యం.డీఏ.సిద్ధిక్, రాష్ట్ర ఉపాధ్యక్షులు మందపాటి శంకరరావు, రాష్ట్రకార్యదర్శి యన్.వి.కృష్టారావు, రాష్ట్ర సహాయకార్యదర్శి బి.టి.వలి, నెల్లూరు జోన్ జోనల్ అధ్యక్ష, కార్యదర్శులు వాకా రమేష్, బాపట్ల జిల్లా అధ్యక్షులు పసుపులేటి చిరంజీవి, గుంటూరు జిల్లా కార్యదర్శి ఇ.విజయ్‌కుమార్, పల్నాడు జిల్లా అధ్యక్షులు ఖాజా, కార్యదర్శి జి.తిరుపతిరావు పాల్గొన్నారు.
ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్
రాష్ట్ర అధ్యక్షులు పలిశెట్టి