భూగర్భ జల శాఖ ఏడీఏగా జి.సురేష్‌ | - | Sakshi
Sakshi News home page

భూగర్భ జల శాఖ ఏడీఏగా జి.సురేష్‌

Jul 4 2025 3:46 AM | Updated on Jul 4 2025 3:46 AM

భూగర్

భూగర్భ జల శాఖ ఏడీఏగా జి.సురేష్‌

బాపట్ల: భూగర్భ జల శాఖ సహాయ సంచాలకులుగా జి.సురేష్‌ గురువారం బాధ్యతలు చేపట్టారు. బాధ్యతలు చేపట్టిన అనంతరం జిల్లా కలెక్టర్‌.జె.వెంకట మురళిని మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను అందించారు. ఇప్పటివరకు ఇక్కడ సహాయ సంచాలకులుగా పనిచేసిన కె.రామబాలాజీ పల్నాడు జిల్లాకు బదిలీ అయ్యారు. గుంటూరు జిల్లా నుంచి పదోన్నతితో బదిలీపై వచ్చిన సురేష్‌కు అధికారులు, కార్యాలయ సిబ్బంది అభినందనలు తెలిపారు.

స్వర్ణాంధ్ర–2047 లక్ష్యంగా పనిచేయాలి

చీరాల: నియోజకవర్గ అభివృద్ధి, పరిశ్రమల స్థాపన, సహజ వనరులపై దృష్టి, స్వర్ణాంధ్ర –2047 ఉద్దేశమని ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య అన్నారు. శనివారం మున్సిపల్‌ కార్యాలయంలో విజన్‌ ప్లాన్‌ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సేవా రంగానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని, సేవారంగం విస్తరిస్తేనే ఆదాయం ఎక్కువగా వస్తుందన్నారు. భవిష్యత్తులో అదే కీలకమన్నారు. విజన్‌ ప్లాన్‌పై ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించి పలు అంశాలపై మాట్లాడారు. ఆర్డీఓ టి.చంద్రశేఖర్‌ నాయుడు, మున్సిపల్‌ కమిషనర్‌ అబ్దుల్‌ రషీద్‌, తహసీల్దార్‌ గోపీకృష్ణ, ఎంపీడీఓ శివసుబ్రహ్మణ్యం, అధికారులు పాల్గొన్నారు.

బెల్టు షాపుల నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలి

వేమూరు: మద్యం బెల్టు షాపుల నిర్వాహకులపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఎకై ్సజ్‌ డిప్యూటీ కమిషనర్‌ కె.హేమంత్‌ నాగరాజు అన్నారు. మండల కేంద్రంలోని ఎకై ్సజ్‌ కార్యాలయం గురువారం పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఎకై ్సజ్‌ స్టేషన్‌ పరిధిలోని మద్య షాపుల నిర్వాహకులు సమయ పాలన పాటించాలన్నారు. మద్యం ప్రభుత్వం ధరలకు విక్రయించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన సిబ్బందిని కోరారు. సీఐ రవి, ఎస్‌ఐ శ్రీకాంత్‌ సిబ్బంది పాల్గొన్నారు.

భూగర్భ జల శాఖ ఏడీఏగా జి.సురేష్‌ 1
1/2

భూగర్భ జల శాఖ ఏడీఏగా జి.సురేష్‌

భూగర్భ జల శాఖ ఏడీఏగా జి.సురేష్‌ 2
2/2

భూగర్భ జల శాఖ ఏడీఏగా జి.సురేష్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement