
విద్యారంగ సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లండి
చీరాల అర్బన్: విద్యారంగ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి కృషి చేస్తానని ఎస్‌టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రఘునాథరెడ్డి అన్నారు. రాష్ట్రోపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం చీరాలలో పట్టణశాఖ 20వ వార్షికోత్సవ వేడుకలను స్థానిక రోటరీ కమ్యూనిటీ హాలులో నిర్వహించారు. కార్యక్రమానికి డీఈఓ ఎస్.పురుషోత్తం, మాజీ ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి హాజరయ్యారు. ఉపాధ్యాయుల సమస్యలను తన దృష్టికి తీసుకువస్తే వాటి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. డీఈఓ ఎస్.పురుషోత్తం మాట్లాడుతూ ప్రభుత్వ సంస్థల బలోపేతం చేయడానికి ఎన్‌రోల్‌మెంట్ పెరుగుదలకు ఇతోధికంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ పాఠశాలల మనుగుడ ఉపాధ్యాయుల కృషిపైనే ఆధారపడి ఉందన్నారు. ప్రభుత్వం చేపడుతున్న సంస్కరణలకు ఊతమిచ్చేలా ఉపాధ్యాయులు కృషి చేసి ప్రభుత్వ పాఠశాలలకు పూర్వ వైభవం తీసుకురావాలన్నారు. అనంతరం పేరాల్లోని ఆంధ్రరత్న మున్సిపల్ హైస్కూల్‌లో 35 సంవత్సరాలు పనిచేసి పదవీవిరమణ చేసిన నాగళ్ల రమణారావు దంపతులను సత్కరించారు. రాష్ట్ర ఆర్థిక కార్యదర్శి కోటేశ్వరరావు, ఉపాధ్యాయ వాణి గాజుల నాగేశ్వరరావు, ఎస్టీయూ జిల్లా బాధ్యులు గడివాడ అమర్‌నాథ్, బడుగు శ్రీనివాస్, కె.ఎర్రయ్య, వి.ప్రఽభాకరరావు, ఎం.ఏసురత్నం, టి.వెంకటేశ్వర్లు, శ్రీదేవి, పార్వతి, అపర్ణ, రమేష్, సుబ్బారెడ్డి, రాజ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.