తల్లిదండ్రుల చేతుల్లోనే పిల్లల ఆరోగ్యం | - | Sakshi
Sakshi News home page

తల్లిదండ్రుల చేతుల్లోనే పిల్లల ఆరోగ్యం

May 31 2025 1:39 AM | Updated on May 31 2025 4:27 PM

గుంటూరు వెస్ట్‌ (క్రీడలు): పిల్లలు శారీరకంగా, ఽమానసికంగా ధృఢంగా ఉండాలంటే క్రీడా సాధన ఎంతో కీలకమని ఏసీబీ డైరెక్టర్‌ ఆర్‌.జయలక్ష్మి తెలిపారు. ఇది పూర్తిగా తల్లిదండ్రుల చేతుల్లోనే ఉందని పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక బీఆర్‌ స్టేడియం సింథటిక్‌ కోర్టులో అండర్‌–16 ఓపెన్‌ బాలబాలికల టెన్నిస్‌ పోటీలు ప్రారంభమయ్యాయి. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జయలక్ష్మి మాట్లాడుతూ కొందరు తల్లిదండ్రులు చదువులకిచ్చే ప్రాధాన్యత పిల్లల ఆరోగ్యానికి ఇవ్వడం లేదన్నారు. దీంతో పిల్లల్లో అధిక శాతం ఊబకాయ సమస్యలు తలెత్తుతున్నాయని తెలిపారు. జంక్‌ ఫుడ్‌తోపాటు మొబైల్స్‌, ఇతర ఎలక్ట్రానిక్‌ గాడ్జెట్స్‌ వీలైనంత వరకు వారికి దూరంగా ఉంచాలని సూచించారు. 

టెన్నిస్‌ విలువ తెలిసిన సీనియర్‌ ఆటగాడు ఎస్‌.రామకృష్ణ ఈ టోర్నమెంట్‌ను స్పాన్సర్‌ చేయడం అభినందనీయం అన్నారు. పోటీల నిర్వాహకుడు షేక్‌ అహ్మద్‌ మాట్లాడుతూ పోటీలు మూడు రోజులపాటు జరుగుతాయన్నారు. మొత్తం 36 మంది చిన్నారులు పాల్గొంటున్నట్లు తెలిపారు. అనంతరం పోటీలను జయలక్ష్మి,, రామకృష్ణ ప్రారంభించారు. కార్యక్రమంలో చీఫ్‌ కన్సర్వేటివ్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌ బీఎన్‌ఎన్‌ మూర్తి, రాష్ట్ర సమాచార శాఖ కమిషనర్‌ పి.శామ్యూల్‌ జొనాథన్‌, జిల్లా క్రీడాభివృద్ధి అధికారి పి.నరసింహారెడ్డి, ఎన్‌.సాంబశివరావు, జీవీఎస్‌ ప్రసాద్‌ పాల్గొన్నారు.

జీజీహెచ్‌లో అరుదైన శస్త్రచికిత్స

గుంటూరు మెడికల్‌: గుంటూరు జీజీహెచ్‌లో అరుదైన శస్త్రచికిత్స చేసి వృద్ధుడి ప్రాణాలు కాపాడినట్లు జనరల్‌ సర్జరీ ప్రొఫెసర్‌ డాక్టర్‌ ఏకుల కిరణ్‌కుమార్‌ చెప్పారు. శుక్రవారం జీజీహెచ్‌ జనరల్‌ సర్జరీ విభాగంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఈ వివరాలు వెల్లడించారు. ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలం మాదారం గ్రామానికి చెందిన పాలిపోగు ప్రసాద్‌ (62) రెండు నెలలుగా కడుపు నొప్పితో బాధపడుతున్నాడు. తీవ్రమైన కడుపునొప్పి, కామెర్లు, చలిజ్వరం రావడంతో ఒంగోలులో 25 రోజులు చికిత్స తర్వాత గుంటూరు జీజీహెచ్‌కు వచ్చాడు. హైడాటిడ్‌ సిస్ట్‌ వ్యాధి (కాలేయంలో నీటిబుడ్డ)తో బాధపడుతున్నట్లు నిర్ధారించామన్నారు. కుక్కల వల్ల, కలుషిత నీటిని తాగడం వల్ల వ్యాధి వస్తుందన్నారు. 

కొన్నిసార్లు మాంసం పూర్తిగా ఉడకకుండా తినడం వల్ల కూడా వస్తుందని చెప్పారు. ప్రసాద్‌ కాలేయం, ఇతర అవయవాలకు ఇబ్బంది ఉండటంతో సర్జరీ చేశామని, దీనికి నాలుగు గంటల సమయం పట్టిందన్నారు. సుమారు 40 రోజులపాటు వార్డులో చికిత్స అందించి డిశ్చార్జి చేశామన్నారు. సుమారు రూ.10 లక్షల ఖరీదైన ఆపరేషన్‌ను ఎన్టీఆర్‌ వైద్య సేవ పథకం ద్వారా ఉచితంగా చేశామని తెలిపారు. ఆపరేషన్‌ ప్రక్రియలో వైద్యులు నాగ సంతోష్‌కుమార్‌, సాదిక్‌ బాషా, వేణుగోపాల్‌, మేఘన, అవిన్‌, హరి, పోలయ్య, శ్యాంసన్‌, శ్వేత, ప్రసాద్‌, హనుమంతరావు, నర్సింగ్‌ సిబ్బంది రాజ్యలక్ష్మి, స్రవంతి, అనిత, ఉష, నంద పాల్గొన్నట్లు వెల్లడించారు. వృద్ధుడి ప్రాణాలు కాపాడిన వైద్య బృందాన్ని ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ఎస్‌ఎస్‌వీ రమణ అభినందించారు.

పోలీసులపై క్రిమినల్‌ కేసులు పెట్టాలని డిమాండ్‌

తెనాలి రూరల్‌: లోకేష్‌ రెడ్‌ బుక్‌ రాజ్యాంగాన్ని నిరాటంకంగా అమలు చేస్తూ దళిత, మైనార్టీ యువకులపై విచక్షణారహితంగా దాడి చేసిన సీఐలు, ఇతర పోలీసు సిబ్బందిపై క్రిమినల్‌ కేసులు పెట్టాలని కుల నిర్మూలన పోరాట సమితి రాష్ట్ర కార్యదర్శి కె.కృష్ణ, షెడ్యూల్డ్‌ కులాల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కార్యదర్శి అందే శ్యాం డిమాండ్‌ చేశారు. తెనాలి ఐతానగర్‌లో బాధిత కుటుంబాలను పరామర్శించిన అనంతరం వారు శుక్రవారం ప్రకటన విడుదల చేశారు.

తల్లిదండ్రుల చేతుల్లోనే పిల్లల ఆరోగ్యం 1
1/2

తల్లిదండ్రుల చేతుల్లోనే పిల్లల ఆరోగ్యం

తల్లిదండ్రుల చేతుల్లోనే పిల్లల ఆరోగ్యం 2
2/2

తల్లిదండ్రుల చేతుల్లోనే పిల్లల ఆరోగ్యం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement