
● క్రికెట్ బెట్టింగ్ స్వైర విహారం ● అప్పుల ఊబిలో పేదల
చీరాలలో 10 మందికి పైగా పెద్ద బుకీలు.. ఏజెంట్లు
రోజువారీ కూలీలు, వ్యవసాయ కూలీలు, చిరువ్యాపారులు ఽఅధికంగా ఉండే చీరాల్లో క్రికెట్ బుకీలు, ఏజెంట్లకు కొదువ లేదు. చీరాల నియోజకవర్గంలో పేరు మోసిన బుకీలు, ఏజెంట్లు లక్షలు సంపాదిస్తూ పేదల రక్తాన్ని తాగుతున్నారు. జాండ్రపేటలో ఇద్దరు, వేటపాలెంలో ఇద్దరు, ఈపూరుపాలెంలో ఇద్దరు ఏజెంట్లు, చీరాల ప్రాంతాల్లో నడుపుతున్నారు. పోలీసులకు సమాచారం తెలియకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ డబ్బు లావాదేవీలంతా ఆన్‌లైన్‌లోనే జరుగుతున్నాయి. ఫలితాన్ని బట్టి డబ్బు అందుతుంది. ఇందుకు నమ్మకస్తులను మాత్రమే ఎంచుకుంటున్నారు. నమ్మకంలేనివారి వద్ద ముందే డబ్బు డిపాజిట్ చేసుకుంటున్నారు.