గోల్డెన్ ప్రైమ్ సిటీ బ్రోచర్ ఆవిష్కరణ
నగరంపాలెం(గుంటూరు వెస్ట్): అమరావతి మండలం నరుకుళ్ళపాడు గ్రామంలో 12 ఎకరాలలో సీఆర్డీఏ అఫ్రూవల్‌తో వారాహి ఇన్‌ఫ్రా టౌన్‌షిప్స్ వారి గోల్డెన్ ప్రైమ్ సిటి బ్రోచర్‌ను ఆదివారం సంస్థ చైర్మన్ కొండవీటి శ్రీనివాసరావు, డైరెక్టర్స్ దేవమిత్ర రాజా, అరుణ్‌ప్రశాంత్, సాయి ఆదిత్య స్కూల్ డైరెక్టర్ రవీంద్రబాబు ఆవిష్కరించారు. కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ లక్కీడిప్‌లో పాల్గొనే అవకాశం కల్పించి గెలుపొందిన వారికి మొదటి బహుమతిగా కారు, రెండు, మూడు బహుమతులుగా రాయల్ ఎన్‌ఫీల్డ్, టీవీఎస్ స్కూటీని విజేతలకు అందించారు. ఫ్లాట్ బుకింగ్ చేసిన ప్రతి ఒక్కరికీ 2 గ్రాముల గోల్డ్ కాయిన్ అందించారు. గతంలో కేఎస్‌ఆర్ డవలపర్స్ పెదపరిమి, గొర్లవారిపాలెంలో పంచాక్షరి గార్డెన్స్ దిగ్విజయంగా పూర్తి చేశామన్నారు. జొన్నలగడ్డలో వారాహి ఇన్‌ఫ్రాజ్యూయల్ సిటి, విజయవాడలో నిడమానూరులో ఎంబసి విల్లాస్ పూర్తి కావస్తుందని నిర్వాహకులు తెలిపారు.
ఉపాధ్యాయుల కేటాయింపు అసంబద్ధం
బాపట్లటౌన్: రాష్ట్ర విద్యాశాఖ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలకు ఉపాధ్యాయుల కేటాయింపు చాలా అసంబద్ధంగా, గందరగోళంగా ఉందని రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం (ఎస్టీయూ) బాపట్ల జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బడుగు శ్రీనివాస్, గుడివాడ అమరనాథ్‌లు తెలిపారు. ప్రభుత్వ తీరును ఆదివారం జరిగిన సమావేశంలో తీవ్రంగా ఖండించారు. విధానాన్ని వెంటనే రద్దుచేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేశారు. ఎస్టీయూ జిల్లా అధ్యక్షులు బడుగు శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రతి గ్రామంలో ఒక పాఠశాలను మోడల్ ప్రైమరీ పాఠశాలగా మార్చి ప్రతి తరగతికి ఒక ఉపాధ్యాయుని చొప్పున ఐదుగురు ఉపాధ్యాయులను కేటాయిస్తామని పత్రికల్లో ఊదరగొట్టిన విద్యాశాఖ అధికారులు ఇప్పుడు 60 రోలు దాటితేనే ఐదుగురు ఉపాధ్యాయులను కేటాయిస్తామని మాట మార్చడం ప్రాథమిక విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేయటమేనన్నారు. రోల్‌తో సంబంధం లేకుండా ప్రతి గ్రామంలో ఒక ప్రాథమిక పాఠశాలను మోడల్ ప్రైమరీ పాఠశాలగా మార్చాలి. వాటికి పీఎస్ హెచ్‌ఎం పోస్టు కేటాయించాలన్నారు.
గోల్డెన్ ప్రైమ్ సిటీ బ్రోచర్ ఆవిష్కరణ


