మూడో శనివారం స్వచ్ఛ దివస్ పాటించాలి
కర్లపాలెం: ప్రతినెల మూడవ శనివారం గ్రామంలో స్వచ్ఛ దివస్ పాటించాలని స్వచ్ఛాంధ్ర ఫైనాన్స్ మేనేజర్ పి.విజయశేఖర్ తెలిపారు. విజయ్‌శేఖర్ గురువారం దమ్మనవారిపాలెం గ్రామ పంచాయతీని ఆకస్మికంగా సందర్శించారు. గ్రామ పంచాయతీలో జరుగుతున్న పారిశుద్ధ్య కార్యక్రమాల వివరాలను సర్పంచ్ వెంకటేశ్వరమ్మను అడిగి తెలుసుకున్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ పంచాయతీ పరిధిలో పారిశుద్ధ్య కార్యమ్రాలు నిర్వహించేందుకు కావల్సిన సామగ్రిని పంపిణీ చేస్తామని తెలిపారు. పారిశుద్ధ్య కార్యక్రమాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని పంచాయతీ అధికారులను ఆదేశించారు. డీఎల్‌పీఓ కుమారస్వామి మాట్లాడుతూ మండలంలోని అన్ని గ్రామ పంచాయతీలలో పూర్తిస్థాయిలో పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. గ్రామ సర్పంచ్ గురపుసాల వెంకటేశ్వరమ్మ, ఎంపీడీఓ అద్దూరి శ్రీనివాసరావు, ఈఓపీఆర్డి శ్రీనివాసరావు, ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ బాషా, పంచాయతీ కార్యదర్శి వీరాస్వామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


