ప్రభుత్వ సహాయ న్యాయవాదిగా బోయిన రమేష్‌బాబు
చీరాల రూరల్: చీరాల కోర్టులో న్యాయవాదిగా విధులు నిర్వర్తిస్తున్న బోయిన రమేష్‌బాబు ప్రభుత్వ సహాయ న్యాయవాదిగా (ఏజీపీ)గా నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం నుండి తనకు ఉత్తర్వులు అందినట్లు రమేష్‌బాబు తెలిపారు. విశాఖపట్టణంలోని ఆంధ్రా యూనివర్సిటీలో న్యాయవాద శాస్త్రం అభ్యసించిన ఈయన 2003 నుండి చీరాల కోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నారు. చీరాలతో పాటు పర్చూరు, ఒంగోలు, గుంటూరు, బాపట్ల, ఏలూరు, నరసరావుపేట, నెల్లూరు, రాజమండ్రి, విశాఖ వంటి కోర్టులలో కూడా విధులు నిర్వర్తించి మంచి పేరు సంపాదించారు. ఇప్పటి నుండి మూడేళ్లపాటు రమేష్‌బాబు ఏజిపి ఈ పదవిలో కొనసాగనున్నారు. గత కొన్నేళ్లుగా చీరాలలో ఏజిపి పోస్టు ఖాళీగా ఉంది. ప్రభుత్వం ఈ పదవిలో ఎవరిని నియమించలేదు. రెండు నెలల కిందట బాపట్ల కోర్టులో ఏజీపీగా విధులు నిర్వర్తిస్తున్న శ్యామలాదేవిని ప్రభుత్వం ఇన్‌చార్జ్ ఏజీపీగా చీరాల కోర్టులో నియమించింది. అప్పటి నుండి శ్యామలాదేవి ఈ వదవిలో కొనసాగుతున్నారు. ప్రభుత్వ ఆస్థులు అన్యాక్రాంతం కాకుండా తనవంతుగా కృషి చేస్తానని రమేష్‌బాబు తెలిపారు. తనకు ఈ పదవి వచ్చేందుకు సహకరించిన స్థానిక ఎమ్మెల్యే ఎంఎం.కొండయ్య, ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్, జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి కొలుసు పార్థసారథికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. చీరాల కోర్టులో ఏజీపీ పదవి బాధ్యతలు చేపట్టిన రమేష్‌బాబును స్థానిక న్యాయవాదులు అభినందించి హర్షాతి రేఖాలు వ్యక్తం చేశారు.


