కాపులకు మొండి చెయ్యి
వేమూరు: కూటమి ప్రభుత్వం వేమూరు మార్కెట్ యార్డు చైర్మన్ పదవి నియామకంలో కాపులకు మొండి చెయ్యి చూపించింది. చైర్మన్ పదవి కమ్మ సామాజిక వర్గానికి కేటాయించడంతో ఆ పదవిపై ఆశలు పెట్టుకున్న కాపు నాయకులు నిరాశకు గురయ్యారు. తెనాలి మార్కెట్ యార్డులో వేమూరు నియోజకవర్గం ఉంది. 2016లో తెనాలి మార్కెట్ యార్డు నుంచి విడిపోయింది. వేమూరు నియోజకవర్గంలోని వేమూరు, కొల్లూరు, భట్టిప్రోలు, అమర్తలూరు, చుండూరు మండలాలు కలిసి వేమూరు మార్కెట్ యార్డుగా ఏర్పాటు చేశారు. వేమూరు నియోజకవర్గంలో ఎస్సీ ఓట్లు అధికంగా ఉన్నాయి. తర్వాత కాపు సామాజిక వర్గం ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. నియోజకవర్గం ఎస్సీ రిజర్వేషన్ కావడంతో ఎమ్మెల్యే ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ఉన్నాడు. రెండో స్థానంలో కాపు సామాజిక వర్గం ఓట్లు ఎక్కువగా ఉండటంతో మార్కెట్ యార్డు చైర్మన్ పదవి కాపులకు కేటాయిస్తారని ఆశించారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినపుడు కాపు సామాజిక వర్గం నాయకులను పక్కన పెట్టి కమ్మ సామాజిక వర్గం నాయకులకు మార్కెట్ యార్డు చైర్మన్ పదవి కట్టబెడుతోంది. 2014 తెలుగుదేశం పార్టీ అధికారం చేపట్టింది. 2016 మార్కెట్ యార్డు ఏర్పాటు చేశారు. 2017లో కమ్మ సామాజిక వర్గానికి చెందిన జొన్నలగడ్డ విజయబాబును మార్కెట్ యార్డు చైర్మన్‌గా నియమించారు. 2017 నుంచి 2019 వరకు ఆయన చైర్మన్‌గా ఉన్నారు. తిరిగి 2024లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. తాజాగా మార్కెట్ యార్డు చైర్మన్ పదవి కమ్మ సామాజికవర్గానికి చెందిన గొట్టిపాటి పూర్ణకుమారిని వరించింది. దీంతో తెలుగుదేశం పార్టీలో కాపు సామాజిక వర్గం చెందిన సీనియర్ నాయకులు నిరాశకు గురయ్యారు. నాయకుల తీరుపై మండిపడుతున్నారు.
మార్కెట్ యార్డు చైర్‌పర్సన్‌గా గొట్టిపాటి పూర్ణకుమారిని నియామకం ఆది నుంచీ కమ్మ సామాజిక వర్గానికే ప్రాధాన్యం రగులుతున్న కాపు సామాజిక నేతలు
వైఎస్సార్ సీపీలో కాపు సామాజిక వర్గానికి అధిక ప్రాధాన్యం
2019లో వైఎస్సార్ సీపీ అధికారం చేపట్టిన తర్వాత మార్కెట్ యార్డు చైర్మన్ పదవి కాపు సామాజిక వర్గానికి కట్టబెట్టి ప్రాధాన్యత కల్పించింది. నియోజకవర్గంలో ఎస్సీ సామాజికవర్గం తర్వాత కాపు సామాజికవర్గం ఎక్కువగా ఉండటం వల్ల మార్కెట్ యార్డు చైర్మన్ పదవి కాపులకు కేటాయించారు. 2020 మార్కెట్ యార్డు చైర్మన్ పదవి కాపు సామాజికవర్గానికి చెందిన బొల్లిముంత ఏడుకొండలు పదవీ బాధ్యతలు చేపట్టారు. 2020 నుంచి 2023 వరకు ఆ పదవిలో కొనసాగారు. 2023 జూన్ నెలలో రెండో విడత ఆయనకే కేటాయించారు. కాపు సామాజిక వర్గానికి చెందిన మహిళ ఉప్పు శిరీషకు యార్డు చైర్మన్ పదవి ఇచ్చారు. ఆమె 2023 నుంచి 2024 వరకు ఆ పదవిలో కొనసాగారు. పార్టీ పదవుల్లోనూ కాపు సామాజికవర్గానికి అధిక ప్రాధా న్యం కల్పించారు. పార్టీ పదవుల్లోనూ కాపు సామాజికవర్గానికి టీడీపీ మొండి చెయ్యి చూపింది.


