హత్యాయత్నం కేసులో ఐదుగురి అరెస్ట్
నూజెండ్ల: వ్యక్తి హత్యాయత్నానికి పథకం రచించిన సెల్‌ఫోను వాయిస్ రికార్డు బయటపడటంతో ఐదుగురిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరచిన సంఘటన గురువారం చోటుచేసుకుంది. ఎస్‌ఐ ఎం.వి.కృష్ణారావు తెలిపిన వివరాల మేరకు మండలంలోని అల్లీభాయిపాలెం గ్రామానికి చెందిన కర్ణాటి వెంకటరావు అదే గ్రామానికి చెందిన మీరావలీ మధ్య నగదు లావాదేవీలు ఉన్నాయి. వెంకటరావు దగ్గర మీరావలీ అప్పుగా కొంత నగదు తీసుకున్నాడు. ఈ విషయంలో ఇరువురు మధ్య అభిప్రాయబేధాలు వచ్చాయి. అప్పు తీర్చకపోగా కర్ణాటి వెంకటరావును హత్య చేసేందుకు ప్రణాళిక రచన చేశాడు. ఈక్రమంలో పాటకోట లాలయ్య, గద్వాల మీరావలీ, బ్రహ్మం, దూదేకుల దస్తగిరితో కలిసి చంపాలని నిర్ణయించుకొని దానికి తగిన నగదు ఇవ్వటానికి మీరావలి ఒప్పందం చేసుకున్నాడు. ఈ పథకం విషయమై జరిగిన సంభాషణలు వారిలో ఒకరు రికార్డు చేశారు. వాయిస్ రికార్డు లీక్ అవటంతో కర్ణాటి వెంకటరావు అప్రమత్తమై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా వాస్తవమని పోలీసులు నిర్థారణ చేసి నిందితుడు మీరావలితో పాటు నలుగురిని అరెస్ట్ చేశారు. వీరిని కోర్టులో హాజరు పరచగా రిమాండ్ విధించినట్లు ఎస్‌ఐ ఎంవీ కృష్ణారావు తెలిపారు.
ఇళ్ల స్థలాల పరిశీలన
మంగళగిరి: నగర పరిధిలోని యర్రబాలెం డాన్‌బాస్కో స్కూలు వద్ద శుక్రవారం పంపిణీ చేసే ఇళ్ల స్థలాలను శుక్రవారం ఎస్పీ సతీష్ కుమార్ పరిశీలించారు. రాష్ట్ర ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ స్థల పట్టాల పంపిణీని ప్రారంభించనున్న నేపధ్యంలో ఎస్పీలీ పరిశీలన జరిపారు. అధికారులకు భద్రతా సూచనలు చేశారు. ట్రాఫిక్, , వాహనాల పార్కింగ్‌కు ఎలాంటి ఇబ్బందీ లేకుండా చూడాలని ఆదేశించారు. కార్యక్రమంలో సీఐ వై. శ్రీనివాసరావు, ఎస్‌ఐలు సిబ్బంది పాల్గొన్నారు.


